Thursday, January 12, 2012

మేం సెక్స్‌లో పాల్గొని ఎన్ని రోజులైందో గుర్తులేదు.. ఇదీ సంగతి..!

!
couple at bed time
ఇపుడు పెళ్లయి పట్టుమని పది నెలలు కూడా గడవని జంటలు చెపుతున్న మాటలు ఇవి. భారతీయ జంటల్లో రోజురోజుకీ పడకగది శృంగారం తగ్గిపోతూ దాంపత్య సుఖానికి..................... దూరమవుతున్నట్లు ఇటీవల పలు సర్వేల్లో తేటతెల్లమవుతోంది.

కదిలిస్తే.. ఎక్కడ బాసూ.. తీరికలేని పని... పిల్లల చదువులు.. శెలవు దొరకదు.. ఒకవేళ శెలవు దొరికినా మా ఆవిడకు దొరకుదు.. ఆమె వచ్చినా తీరిక దొరకదు.. ఇద్దరం ఇంటివద్ద ఉన్నామని తెలిస్తే.. బంధువులో.. స్నేహితులో ఇంటిపై దాడి.. వారు కాకపోతే పొరుగింటివారు ఇంట్లో తిష్ట వేయడం... ఇలా అనేకానేక కారణాలను చెప్పడం ఎక్కువైపోయిందంటున్నారు.

ఇక మహిళ విషయానికి వస్తే ఇదే తంతు.. రతి సుఖాన్ని చవిచూసి రోజులు కాదు.. వారాలు కాదు.. నెలలే గడిచిపోయాయని చెప్పేవారు ఎక్కువవుతున్నారు. అదేమని అడిగితే.. మావారు బిజీ.. నేను బిజీ అనే సమాధానం వస్తోంది.

ఇన్ని బిజీల మధ్య ఏదో సమయాన్ని దొరకబుచ్చుకుని రాత్రికి కానిచ్చేద్దామని అనుకున్నప్పటికీ వారంలో జరిగిన గతానుభవాలను చెప్పుకుంటూ అలసిపోయి అతడు అటు.. ఆమె ఇటు తిరిగి గుర్రు పెట్టి నిద్రపోయే సంఘటనలు మామూలైపోతున్నాయట.

ఆధునిక దంపతుల మధ్య ఈ సెక్స్ ఎడబాటుకు కారణాలేంటన్న ప్రశ్నకు.. సెక్సాలజిస్టులు చెప్పే సమాధానం ఏంటయా అంటే... వృత్తిపరమైన ఒత్తిడి, సమయాభావం, సెక్స్‌కు ప్రేరేపించే వాతావరణం కరవవడం వంటి అనేక కారణాలు నేటి జంటల మధ్య ఆ అనుభవాన్ని లేకుండా చేస్తోందంటున్నారు.

సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేందుకు ఆధునిక జంటలు తమ జీవనశైలిని మార్చుకోవాల్సి ఉందన్నారు. పురుషులు వృత్తిపరమైన ఒత్తిడికి లోనై పడక గదిలో చప్పగా పడుకున్నప్పటికీ స్త్రీ ఆ విషయంలో చురుకైన పాత్ర పోషించాలని సలహా ఇస్తున్నారు. అదేవిధంగా స్త్రీ, ఇంటిపనులు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, పిల్లల చాకిరీతో సతమతమవుతారు కనుక పరిస్థితిని అర్థం చేసుకుని పురుషుడు మసలుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరి మోడ్రన్ కపుల్స్ తమ లైఫ్ స్టయిల్‌ను మార్చుకుని సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారో... లేదంటే బిజీబిజీ టైం లేదంటారో..?!!

No comments:

Post a Comment