Tuesday, February 14, 2012

కాజల్‌ అగర్వాల్ అవి వేసుకుందంటే హిట్టేనట

Kajal Agarwal
సినిమారంగంలో సెంటిమెంట్‌కు కొదవే లేదు. అన్న నడిచొస్తే మాస్‌...................... అన్న కూర్చుంటే.. మాస్‌... అన్నట్లు... హీరోహీరోయిన్లు ఏంచేసినా.. సెంటిమెంట్‌తో దర్శకనిర్మాతల్ని కొట్టేస్తారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తమిళం 'మాట్రాన్‌' 'తుపాకి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఏ భాషల్లోనైనా తొలిషాట్‌ షూటింగ్‌లో తెల్లటి వస్త్రాలు కావాలని పట్టుపడుతోంది. ఇది చాలా సెంటిమెంట్‌ అని దర్శక నిర్మాతలకు చెబుతోందట. దీంతో వారు చచ్చినట్లు తెల్లటివస్త్రాలు తెచ్చి.. షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు.

కొన్ని సినిమాల విషయాల్లో ఈ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయిందని... మగధీర గురించి చెప్పింది. ఇటీవలే తన సెంటిమెంట్లు గురించి చెబుతూ... తెలుపు వేసుకుంటే చాలు.. హిట్టే అని అంది. హిందీలో కూడా సింగం ముహూర్తపు షాట్‌ కూడా తెల్లటి వస్త్రాలతో చేశానని చెప్పింది. దీంతో తమిళంలో రెడీగా ఉన్న రెండు చిత్రాలకు నిర్మాతలు ఆమె అడిగినట్లే వస్త్రాలు తెచ్చారట. మరి ప్రతి సినిమాకు ఇలా వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

No comments:

Post a Comment