
మామూలుగా పీరియడ్స్ సమయంలో పొట్ట కింది భాగంలో ఒకవైపు నొప్పి వస్తుంది. అండం విడుదల అయ్యే సమయంలో ఇది రావటం సహజం. అయితే ఉదరం కుడి వైపు భాగంలో నెప్పి వస్తుంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అవసరమైతే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
అదే విధంగా స్త్రీలకు సెక్స్ సమయంలో నొప్పి, లేదా ఇతర రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నొప్పి కేవలం ఏదో కొన్ని భంగిమలలో మాత్రమే వస్తూ వుంటే మీరు పట్టించుకోనవసరం లేదు. అదేవిధంగా సెక్స్ పరంగా రిజిడిటీ వున్నా, ఉద్రిక్తత చెందకపోయినా కూడా ఇదే సమస్య వస్తుంది.
ఇలా కాకుండా ఎప్పుడూ జననాంగం వద్ద నెప్పిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫ్యామిలీ డాక్టర్‌కి ఈ విషయం చెప్పవలసి వుంటుంది. రుతుచక్రం సమయంలో నొప్పులు, డిస్ట్రర్బెన్స్‌గా ఫీలవడం మామూలే. కానీ, ఈ నెప్పులు ఇతర సమస్యలు విపరీతంగా, భరించలేనివిగా ఉంటే అది ఏదన్నా వ్యాధికి సంబంధిచినవి కావచ్చు అనేది గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment