స్వలింగ సంపర్క వివాహాలనేవి వ్యక్తిగతమా లేక సామాజికమా..?! ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం........................... ఎవరు తీసుకోవాలి.. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులా? లేక దాన్ని పూర్తిగా ప్రజల విచక్షణకే వదిలేయాలా? ఇప్పుడు అమెరికాలో ఇదే చర్చ తీవ్రంగా సాగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమయిన అమెరికాలో మానవ హక్కులకు పెద్ద పీట వేస్తారు. అదే క్రమంలో, స్వలింగ సంపర్క వివాహాలను కూడా పౌర హక్కుల ప్రాతిపదికనే చూడాలనే వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే, పైకి విచ్చలవిడితనంతో కూడిన సమాజంగా కనిపించే అమెరికాలో సంప్రదాయవాదుల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ కాదు. వారు ఈ వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. దానికితోడు, స్వలింగ సంపర్కాలకు క్రైస్తవ మతంలో చోటు లేదు. అది దైవ సంకల్పానికి వ్యతిరేకమని సంప్రదాయవాదులంటున్నారు. దాన్ని తోసిరాజంటూ, కొందరు క్రైస్తవ మత బోధకులు చర్చిల్లో ఇద్దరబ్బాయిలకు లేదా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయడం కూడా ఇటీవలికాలంలో సాధారణంగా మారింది.
సంప్రదాయ వాదులు, ఆధునిక వాదుల మాటలెలా ఉన్నా ఇప్పటికే ఆ దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ వివాహాలను చట్టబద్ధం చేస్తూ తమ తమ అసెంబ్లీల్లో బిల్లులను ఆమోదించుకోగా, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లులు ఇంకా ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో భాగంగా, తాజాగా, స్వలింగ సంపర్క వివాహాలను ఆమోదిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ క్రిష్ క్రిస్టీ వ్యతిరేకిస్తూ దాన్ని వీటో చేశారు.
ప్రజాస్వామిక దేశమయిన అమెరికాలో దేశాధ్యక్షుడికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు కీలకాంశాలపై వీటో చేసే అధికారం ఉంటుంది. ఆ దేశంలో చట్టసభలు అధ్యక్షుడికి ఇష్టంలేని ఏమయినా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నపుడు, తనకు సంక్రమించిన అధికారాలతో ఆయా నిర్ణయాలను వీటో చేసే అవకాశం అధ్యక్షునికి లేదా ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఉంటుంది. ఇప్పుడు న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయాన్నే తీసుకున్నారు. స్వలింగ సంపర్కాల్లాంటి వివాదాస్పద కీలక అంశాలపై నిర్ణయాధికారాన్ని పూర్తిగా ప్రజలకే వదిలేయాలని ఆయన అభిప్రాయం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిపిన తర్వాత మెజారిటీ ప్రజలు దేన్ని కోరితే దాన్ని అమలు చేయాలని ఆయనంటున్నారు.
"సమాజంపై నేరుగా ప్రభావం చూపే ఇటువంటి కీలక అంశాలపై నిర్ణయాలను గుడ్డిగా అసెంబ్లీ నాలుగు గోడల మధ్య కూర్చుని చేయరాదని నేను మొదటి నుండి చెబుతునే ఉన్నాను... ఇప్పుడూ ఇదే చెబుతున్నాను," అంటూ ఈ రిపబ్లికన్ పార్టీ గవర్నర్ గే వివాహాల బిల్లును వీటో చేసే సందర్భంలో వ్యాఖ్యానించారు. మనల్ని (శాసన సభను) ఎన్నుకున్న వారి (ప్రజల) అభిప్రాయాన్ని మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.. ఇందుకోసం, రిఫరెండం చేపడదాం అని ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని సవరించడానికి ఇదే ఏకైక ఉత్తమ మార్గమని వాదిస్తున్నారు. అయితే, డెమోక్రాట్లు మాత్రం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం గమనార్హం! స్వలింగ సంపర్క వివాహాలను ఒక పౌర హక్కుగా తాము భావిస్తున్నామని ఆ పార్టీ అంటోంది. "స్వలింగ సంపర్క వివాహాలనేవి ఆయా వ్యక్తులు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు..వారి వారి వ్యక్తిగత జీవితాల్లోకి మనమెలా జొరబడతాం.. వారు మనఃపూర్వకంగా తీసుకునే నిర్ణయాలను మనం వ్యతిరేకించకూడదు. ఇది వారి హక్కుల్ని కాలరాయడమే,"అని డెమోక్రాట్లంటున్నారు.
అదే సమయంలో న్యూజెర్సీ పొరుగున ఉన్న మేరీల్యాండ్‌లో గే వివాహాలను చట్టబద్ధం చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ దిగువ సభ 71-67 తేడాతో ఒక బిల్లును ఆమోదించింది. అది త్వరలో ఆ రాష్ట్ర సెనేట్ ముందుకు తుది ఆమోదానికి వెళ్లనుంది. కాగా, అమెరికాలోని న్యూయార్క్, మసాచుసెట్స్, కనెక్టికట్, వెర్మాంట్, న్యూ హ్యాంప్‌షైర్, లోవా, వాషింగ్టన్, కొలంబియాల్లో స్వలింగ-సంపర్క వివాహాలను ఇప్పటికే చట్టబద్ధం చేసారు.

No comments:
Post a Comment