Monday, February 13, 2012

శృంగారంలో స్థూలకాయుల ప్రభావం అంతంతమాత్రమే!

అనారోగ్యాన్ని కలిగించే కారణాల్లో స్థూలకాయం ఒకటి. దీనివల్ల శరీరం బరువు పెరగడం, త్వరగా అలసటకు గురి చేయడమే కాదు........................................శృంగారాన్ని కూడా ప్రభావితం చేయగలదు. స్థూలకాయులు శృంగారంలోనూ ఎక్కువ సేపు పాల్గొనలేరు. అంటే.. సాధారణ శరీరం కలిగిన వారితో పోలిస్తే శీఘ్రస్ఖలనం వచ్చే అవకాశాలు ఎక్కువ. కేవలం మానసిక పరమైన ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్లే శీఘ్రస్ఖలన సమస్య ఏర్పడుతుందని ఇప్పటి వరకూ భావిస్తున్నారు.

కానీ పలు సర్వేలు వెల్లడించిన ఫలితాల మేరకు... శీఘ్రస్ఖలన సమస్య ఉన్నవారిలో 60 శాతం పైగా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువుతో బాధపడుతున్నారని తేలింది. కేవలం బరువు పెరగడం వల్లే శీఘ్రస్ఖలన కలుగుతుందని చెప్పడానికి శాస్త్రీయమైన అంశాలు ఏమీ లేవని తేలింది.

అయితే, శీఘ్రస్ఖలనం సంగతి అలా ఉంచితే పురుషులు బరువు పెరిగితే ముందుగా ఉదరభాగం పెరుగుతుందట. శృంగార సమయంలో అధిక బరువు వల్ల చలాకీగా లేకపోవడంతో పాటు ఉదర భాగంలో చేరిన కొవ్వు వల్ల ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుందని ఈ సర్వే తేల్చింది.

స్త్రీలకు కూడా ఇటువంటి సమస్యలతో పాటు వారి అందం దెబ్బతింటుంది. ఇలాంటి కారణాలు సెక్స్ జీవితాన్ని ప్రభావితం చేసి తీరతాయని వైద్యులు చెపుతున్నారు. ఆనందకరమైన సెక్స్ జీవితాన్ని కోరుకునే వారు ముందుగా చేయవలసింది స్లిమ్‌గా ఉండడం.

No comments:

Post a Comment