Tuesday, March 27, 2012

దిల్షాన్‌తో డేటింగ్ నిజమే.. సండే టైమ్స్‌కు నోటీసు పంపుతా: నుపుర్

Nupur Mehta
అంతగా గుర్తింపు లేని బాలీవుజ్ నటి నుపుర్ మెహతాను బుక్ మేకర్లు క్రికెటర్లను ఆకర్షించేందుకు ఉపయోగించేవారని ఇంగ్లండ్‌కు చెందిన............................. ది సండే టైమ్స్ ఇటీవల విడుదల చేసిన కథనంపై నుపుర్ సీరియస్ అయ్యారు. ఫిక్సింగ్‌పై తనకెలాంటి అవగాహన లేదని, త్వరలోనే ఆ పత్రికకు లీగల్ నోటీసును పంపించనున్నట్లు తెలిపింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లోనికి భారత క్రికెటర్లను లాగొద్దని నుపుర్ వెల్లడించింది.
మరోవైపు భారత క్రికెటర్లతో సంబంధాలపై సమాధానమిచ్చేందుకు నిరాకరించింది. ‘దయచేసి భారత క్రికెటర్లను ఇందులోకి లాగొద్దు. భారత క్రికెటర్లతో సంబంధాలపై దాటవేసిన నుపుర్ మెహతా దిల్షాన్‌తో డేటింగ్ మాత్రమే నిజమని స్పష్టం చేసింది. ఏదోలా పేరు తెచ్చుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు వస్తున్న విమర్శలను నుపుర్ తిప్పికొట్టింది. తప్పుడు కథనాలతో స్నేహితులు సైతం దూరమయ్యారని చెప్పారు. మరోవైపు మ్యాచ్ ఫిక్సింగ్ కథనంలో నుపుర్ ఫొటోను వాడుకుని అప్రతిష్టపాలు చేసినందుకు సండే టైమ్స్ పత్రికకు త్వరలోనే లీగల్ నోటీస్ పంపిస్తామని నుపుర్ తరపు న్యాయవాది తెలిపారు.

No comments:

Post a Comment