Friday, April 20, 2012

వద్దు.. వద్దంటూనే ప్రతి పురుషుడు చేసే పని ఏంటి?

వద్దు.. వద్దంటూనే ప్రతి పురుషుడు చేసే పని ఏంటి? అనే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేపుతుంది. కారణం...... వద్దు వద్దంటూనే పురుషుడు చేసే పని ఏంటబ్బా అని ఆలోచన చేయడమే. ఆ పనే హస్త ప్రయోగం. దీనిపై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవేమో! దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చు. వద్దనుకుంటూనే ప్రతీ పురుషుడు చేసుకునే పనే ఇదేనని సెక్స్ నిపుణులు చెపుతుంటారు.

వాస్తవానికి హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని చెపుతున్నారు. సెక్స్‌ భాగస్వామి లేనప్పుడు, సెక్స్‌లో పాల్గొనే అవకాశం కన్పించనప్పుడు అనుసరించదగిన క్షేమకర, ఆరోగ్యకరమైన అలవాటు ఇదే. హస్తప్రయోగ సమయంలో చేతిలో అంగం ఎలా కదులుతుందో అదే కదలిక సెక్స్‌ సమయంలో యోనిలో జరుగుతుంది.

అందువల్ల అతిగా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల అంగం బలహీనపడడం అనే అపోహ కేవలం అర్థంలేనిదని చెప్పొచ్చు. అధికంగా మాట్లాడే వారి నాలుక ఎప్పుడైనా బలహీనపడడం చూశారా. అలాగే.. అతిగా హస్త ప్రయోగం చేయడం వల్ల అంగం బలహీన పడుతుందన్న కేవలం అపోహ మాత్రమే.

అలాగే కీళ్ళనొప్పులకు హస్త ప్రయోగానికి సంబంధం లేదని చెపుతున్నారు. హస్త ప్రయోగం వల్ల లాభాలే ఉన్నాయని ఫ్రాయిడ్‌ గతంలో చెప్పాడు. పైపెచ్చు.. హస్త ప్రయోగం వల్ల ఒత్తిడి పోతుంది. అక్రమ సంబంధాలకు పోయి రోగాలు తెచ్చుకోవడం కంటే.. ఇదే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment