Sunday, April 22, 2012

తెలుగు ప్రేక్షకులకు సన్నీ లియోన్ అందచందాలు!

sunny leone
సన్నీ లియోన్... కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. 'బిగ్ బాస్-5' తర్వాత........................భారతీయ సినీ మార్కెట్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంది. ఈ ఇండో-కెనడియన్ పోర్న్ గర్ల్ త్వరలోనే టాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేయనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ నిర్మిస్తున్న 'జిస్మ్-2' చిత్రం షూటింగ్ శరవేగంగా రాజస్థాన్‌లో జరుగుతోంది.

కొద్దిగా పోస్ట్, ప్రీ ప్రొడక్షన్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, టాలీవుడ్ తాజా సమాచారం మేరకు.... 'జిస్మ్-2' చిత్రాన్ని తెలుగులోకి అనువదించనున్నారు. గతంలో అనేక బాలీవుడ్ చిత్రాలు తెలుగులోకి అనువదించగా, పలు చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

తాజాగా, విద్యాబాలన్ నటించిన "డర్టీ పిక్చర్", "రాగిణి ఎంఎంఎస్" వంటి చిత్రాలు కూడా తెలుగులోకి అనువదించగా, మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా.. 'డర్టీ పిక్చర్'కు తెలుగులో రికార్డు కలెక్షన్లు వచ్చాయి. దీంతో సన్నీ లియోన్ నటిస్తున్న "జిస్మ్-2" చిత్రాన్ని టాలీవుడ్‌లోకి అనువదించాలని నిర్మాతలు నిర్ణయించారు. సో.. తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నీ లియోన్ తన అందచందాలను చూపించనున్నారు.

1 comment:

  1. ఫ్రెండ్ ! "బ్లాగిల్లు" క్రొత్తగా ప్రారంభించిన తెలుగు బ్లాగుల ర్యాంకింగ్ లో మీరుకూడా చేరమని అభ్యర్ధన!
    http://blogillu.com/rank

    ReplyDelete