Saturday, May 5, 2012

పవన్ నుంచి విడాకులు కోరుతున్న రేణూదేశాయ్?

renu desai
రేణూదేశాయ్.. మాజీ నటి. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి................... గత కొంతకాలంగా రేణూ దేశాయ్‌కూ, పవన్‌ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు పొడచూపినట్టు హైదారాబాద్ ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిని నిజం చేసేలా రేణూ దేశాయ్ వ్యవహారశైలీ కూడా ఉంది. ఇకపై పవన్‌తో కలిసి ఉండలేనన్న నిర్ణయానికి వచ్చిన రేణూ దేశాయ్... పవన్‌ను విడాకులు కోరినట్టు తాజా సమాచారం.

ఇప్పటికే మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ కష్టాలు మాత్రం వీడటంలేదు. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడన్న పేరు పవన్‌కు ఉంది. అయితే, తన తాజా చిత్రం "గబ్బర్ సింగ్‌" షూటింగ్ సమయంలోనే భార్య రేణూతో విభేదాలు పెరిగినట్టు వినికిడి. అందుకే రేణూదేశాయ్.. విడాకులు కోరినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆమె పది కోట్ల రూపాయల భరణం కోరినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

No comments:

Post a Comment