Monday, June 4, 2012

అంగంపై చర్మం వెనక్కి వెళ్లకుంటే సున్తీ చేయించుకోవాలా?

చాలామంది యువకులకు అంగం మీద చర్మం వెనక్కి వెళ్లదు. ఎంతగా ప్రయత్నించినా................. చర్మం వెనక్కి వెళ్లక పోగా నొప్పిగా ఉంటుంది. అయితే, ఇది కొంతమందికి ఇబ్బంది అనిపించదు. కానీ, శృంగారంలో బాగాగే ఎంజాయ్‌ చేస్తారు. మరికొందరికి మాత్రం అసౌకర్యంగా ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్నా తగిన సంతృప్తిని పొందలేరు. ఇదే విషయంపై స్నేహితులను ప్రశ్నించే మాత్రం.. చర్మం వెనక్కి పోకుంటే సున్తీ చేయించుకోవాలని సలహా ఇస్తుంటారు.

వాస్తవానికి అంగంపై చర్మం వెనక్కి వెళ్లకుండా ఉంటే సున్తీ చేయించుకోవాలా లేదా అనే విషయంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... చర్మం వెనక్కి పోనప్పటికీ.. సెక్స్‌లో పాల్గొన్నపుడు ఇబ్బంది అనిపించకపోతే ఆపరేషన్‌ అవసరం లేదంటున్నారు. నొప్పి అనిపించడం, పూర్వచర్మం మూత్ర రంధ్రాన్ని మూసివెయ్యడం వంటి సందర్భాలలో తప్పనిసరిగా సర్కమ్‌ సెషన్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఇలాంటి విషయాల్లో స్నేహితుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది కాదంటున్నారు. ఆరోగ్యం, సెక్స్‌, మెడిసిన్స్‌ వంటి విషయాల్లో నిపుణులైన వైద్యుల సలహాలను విధిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. స్నేహితులు మంచి ఉద్దేశ్యంతో చెప్పినా వాళ్లకున్న మిడిమిడి జ్ఞానంతో మనలను పక్కతోవ పట్టించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment