Tuesday, June 5, 2012

స్త్రీపురుషుల్లో అసలైన కామకేంద్రం మెదడు!

couple
సెక్స్ విషయంలో అనేక మంది స్త్రీపురుషులకు అనేక రకాల అపోహలు ఉంటాయి. అలాగే, పురుషులకు కూడా ప్రధానంగా అంగస్తంభన విషయంలో...................... అపోహలు కోకొల్లలుగా ఉండటం సహజం. కాకపోతే కొందరు అతిగా స్పందించి దాని గురించే పదేపదే ఆలోచన చేస్తూ మదనపడుతుంటారు. పురుషాంగం పరిమాణాలు (సైజులు) అందరిలోనూ ఒకేలా ఉండవు. పెద్ద సైజులో ఉన్నంత మాత్రాన అలాంటి వారిలో ప్రత్యేకించిన విషయమేమీవుండదు.

అంతమాత్రాన చిన్న సైజును చూసుకుని కొందరు ఇక జీవితంలో ఇక తాము ఎందుకూ పనికిరామనే నిర్థారణకు కూడా వచ్చేస్తుంటారు. ఇలాంటి వారు ఒక్కోసారి ఆత్మన్యూన్యతతో తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. మరికొందరు విచిత్రంగా తమ బాధలు చెప్పుకోలేక నకిలీ వైద్యులను సంప్రదించి మోసపోతుంటారు. తమ అంగం నిలకడగా ఉండదని... కుడిపక్కకో... ఎడమ పక్కకో వంగి ఉందంటూ బాధపడుతుంటారు.

సాధారణంగా సెక్స్‌పై అంతగా స్పందన లేకుంటే.. అంగం సైజు చాలా తక్కువ పరిమాణంలో ఉండటం సహజం. అసలు ఇవన్నీ పక్కనపెడితే... శృంగార జీవితానికి కావలసింది పొట్టా... పొడుగా... వంకరా... చిన్నదా అనేది కాదు. మనుషుల సైజులలోనే ఎన్నో తేడాలు ఉంటాయి. రంగుల్లో, రూపురేఖల్లో కూడా చాలా తేడాలు స్పష్టంగా ఉన్నట్లే అంగ పరిమాణంలో కూడా అలానే తేడాలు ఉండటం ప్రకృతి ధర్మంగా భావించాలి. స్త్రీల విషయంలోనూ అంతే... అయితే పురుషులు స్పందించినట్లుగా వాళ్లలో అటువంటి పరిస్థితి ఉండదు.

ఇక్కడ ఇరువురిలోనూ ఓ ముఖ్యమైన విషయ ఉంది. తమలో సెక్స్ స్పందనలు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానాంశం. తృప్తిచెందడం అనేది మానసిక భావన. మనసు ఉల్లాసంగా ఉంటే అదే లక్షకోట్ల ఆనందం ఇస్తుంది. అదే మానసిక స్థితి బాగోలేనప్పుడు ఎంతగా స్పందించినా తృప్తి అనేది ఉండదు. అందుకే ఆలుమగలు, ప్రియుడు ప్రియురాలు ఇద్దరిలోనూ ముందు ఒకరినొకరు ఇష్టం కలిగించుకునేలా నడుచుకోవాలి. ఒకరులేనిదే మరొకరు లేరనే భావన ఇద్దరిలో కలిగినప్పుడు వాళ్లు చేసే ప్రతి పనిలోనూ తృప్తి వంద శాతం ఉంటుంది.

అన్నింటికన్నా ముఖ్యం మన మెదడు. అదే అసలైన కామకేంద్రం. ఒకవేళ మనిషికి ఆందోళనలు, ఆర్థిక సమస్యలు, అనవసర భయాలు అందులో చోటుచేసుకుంటే అవి సెక్స్‌ సామర్థ్యాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించి వేస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎప్పుడైతే ఆందోళనలు, భయాలు వీడిపోతాయో మళ్లీ సెక్స్‌ సామర్థ్యం దానంతట అదే పెరుగుతుంది. సో.. మానసిక ఆందోళన లేకుండా ఉంటే సెక్స్‌లో హద్దులులేని ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చని సెక్స్ వైద్య నిపుణులు చెపుతున్నారు.

No comments:

Post a Comment