Wednesday, June 13, 2012

సెక్స్‌తో ఒత్తిడి ఫటాఫట్

చాలా కుటుంబాల్లో శృంగారమన్న పదమే నిషిద్ధం. సెక్స్ గురించి మరొకరితో చర్చించకూడదన్న భావన ఎప్పటినుంచో నాటుకుపోయింది. అయితే సెక్స్..................... వల్ల లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. శృంగారంలో పాల్గొనేవారు మానసిక ఒత్తిడికి లోనవరు. అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే ఆరోగ్యం, సంతోషాలు ఏపాటివన్న వాటిపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి.

శృంగారంలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండెసంబంధిత వ్యాధులు రావని తేలింది. అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి, బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి.

వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులలో ఇతరులకంటే గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గినట్లు గుర్తించారు. శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువని తేలింది.

No comments:

Post a Comment