
నిద్రలో అంగస్థంభనలు బాగా ఉన్నవారిలో మెలకువగా ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకున్నప్పుడో లేదా భార్యతో శృంగారం సమర్థవంతంగా చేయగలుగుతారో లేదో అన్న ఒక రకమైన ముందస్తు భయాందోళనలు, ప్రతికూల సూచనల వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్టు తేలింది. ఇందుకు కారణం సెక్స్ స్పందనలు మెదడు నుంచి శృంగార అవయవాలకు చేరకుండా నిరోధింపబడి అంగస్థంభన లోపానికి దారి తీస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
నిద్రలో అంగస్థంభనలు బాగా ఉన్న వారికి చికిత్స - కౌన్సెలింగ్ బాగా పని చేస్తుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉధృతి వల్ల యువకులలో శృంగార వాంఛ అధికంగా ఉంటుంది. అలాగే, శృంగారం గురించిన అపోహలూ ఎక్కువగా ఉంటున్నాయి. యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచే నిరంతరం శృంగారం గురించే అధికంగా ఆలోచించడం కూడా ఒక కారణమేనని వారు చెపుతున్నారు.
సెక్స్ పట్ల విపరీతమైన భయంతో పెళ్లికి ముందే కొన్నేళ్ళ నుంచి న్యూనతకు గురవుతూ అంగస్థంభన లోపంతో బాధపడటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని చెపుతున్నారు. చాలామంది యువకులలో తమ అంగం చిన్నదిగా ఉందన్న అనుమానం కూడా ఈ సమస్యకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు. స్త్రీలలో శృంగార జ్ఞానం లేకపోవడం, భర్తల సామర్థ్యం మీద భార్యలు నెగెటివ్‌గా కామెంట్ చేయడం కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది.
No comments:
Post a Comment