రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు 52వ రోజుకు చేరుకున్నాయి. వివిధ జిల్లాలో ఉద్యమాలు ఎగిసి పడుతున్నాయి. ఏపీఏన్జీఓ నేతల పిలుపుతో
గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను విద్యార్థి ఐకాస నేతలు ముట్టడించారు. బీఎస్ఎన్ ఎల్, పోస్టల్ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకారం అందించాలని వారు కోరారు.
విశాఖ పట్టణం :
జిల్లాలో ఏపీఎన్జీఓ సంఘం నేతలు కదం తొక్కారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తప్పించి ఇతర ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం 1000 బైక్ లపై సింహాచలం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏపీఏన్జీఓ సంఘం నేతలు తెలిపారు.రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని స్వామిని కోరుతామని వారు తెలిపారు.

No comments:
Post a Comment