Thursday, September 19, 2013

'బ్రేక్ అప్' సినిమా టీమ్ తో చిట్ చాట్


ప్రస్తుత కాలంలో యూత్ ఎంత త్వరగా ప్రేమించుకుంటున్నారో, అంతే త్వరగా విడిపోతున్నారు. 'బ్రేక్ అప్' ను కూడా ఈవెంట్ గా భావించే ట్రెండ్ నడుస్తోందని 'బ్రేక్ అప్' సినిమా చిత్ర బృందం అంటోంది. ఈ ట్రెండ్ కు అనుగుణమైన కథాంశాన్ని 'న్యూ డైమన్షన్ స్క్రీన్ ప్లే'తో తెరకెక్కిన చిత్రం 'బ్రేక్ అప్'. రణధీర్ (హ్యపీడేస్), స్వాతీ దీక్షిత్ (తొలి పరిచయం) జంటగా నటిస్తున్నారు. అమర్ కామెపల్లి దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమాను 'ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ' నిర్మిస్తోంది. ఈనెల 20న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా బ్రేక్ అప్ చిత్ర యూనిట్ '10టివి' ప్రత్యేక చిట్ చాట్ లో తమ అభిప్రాయాలు పంచుకుంది.
 ప్రశాంత్ (స్ర్కీన్ ప్లే, మాటలు, రచయిత)...'' మాకు ఈ వినాయక చవితి గుర్తుండి పోయే పండగ. ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఈ వినాయక చవితి రోజు సినిమా ప్రారంభించాం. ఈ పండగ హైదరాబాద్ లో చాలా బాగా జరుగుతుంది. అందరు కలిసిపోయిచేసుకునే పండుగ కాబట్టి ఉత్సాహంగా జరుపుకుంటారు.
 'బ్రేక్ అప్' సినిమా ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్ధం పడుతుంది. మొదట స్ర్కీప్టులో ఒక పాయింట్ అనుకున్నాం... కానీ సినిమాలో తీసేటప్పటికి చాలా మార్పులు జరిగాయి. ఇది సందర్భాన్ని బట్టి మారుతూ వచ్చింది. సాధారణంగా ఏదైన ఒక విషయాన్ని ఒకరు ఒకలా చెబితే మరోకరు మరోలా చెబుతుంటారు. అలాగే ఈ సినిమాలో జరిగింది. సినిమాలో మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది. మ్యూజిక్ కంపోజ్ చేసిన 'ఇండస్ ఘరానా టీమ్' మేఘరాజ్, రాహుల్ మోడ్రన్ పొయెట్రీ కి చెందిన వారు. పాటలు చాలా బాగున్నాయి. కొన్ని పాటలు మేము అందరం కలిసి రాశాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 20 సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చూడవల్సిన సినిమా. దీన్ని చూడకపోతే జీవితంలో ఒక క్షణం మిస్ అయినట్లే..'' అన్నారు.
 స్వాతి దీక్షిత్(హీరోయిన్)..' నాకు చిన్నప్పటి నుంచి గణేష్ పండగ అంటే చాలా ఇష్టం. ప్రతి సారి చాలా ఎంజాయ్ చేస్తాం.
మొదట నేను బెంగాలీ చిత్రం తెలుగు 'కొత్తబంగారు లోకం' రీమేక్ లో నటించాను. ఆతర్వాత మా సినిమా దర్శకుడు.. ఈ బ్రేక్ అప్ సినిమా దర్శకుడితో పరిచయం వల్ల నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. మొదట సినిమా స్టోరీ విన్నప్పుడు మాములుగానే అనిపించింది. దానిలో నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. కానీ ఆ తర్వాత షూటింగ్ లోకి వెళ్లినప్పుడు నా పాత్రకు ఉండే ప్రాముఖ్యత ఏంటో అర్ధమైంది. సినిమా బాగా వచ్చింది. పాటలు బాగున్నాయి. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దీనిలో మేఘరాజ్, రాహుల్ కొత్త ట్యూన్స్ ఇచ్చారు. డ్యాన్సులు సినిమాకు హైలెట్. కొరియోగ్రాఫర్ అజయ్ అద్భుతంగా లీడ్ చేశాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది'' అన్నారు.
  మేఘరాజ్, రాహుల్ (సినిమాకు సంగీతం అందించిన 'ఇండస్ ఘరానా' టీమ్)...''మా మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది. తెలుగులో ఇది ఎప్పుడూ వాడలేదు. క్లాసికల్ మ్యూజిక్ కి ఇది మిక్స్ గా ఉంటుంది. పాటలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ కలిసి ఉంటాయి. మా స్లైల్లో మేము మ్యూజిక్ అందించాం. ఇండస్ ఘరానా మ్యూజిక్ చాలా ఢిపరెంట్ గా ఉంటుంది. సినిమా చూస్తే అది అర్థమవుతోంది'' అన్నారు.

No comments:

Post a Comment