సాధారణంగా ఏదైన అనారోగ్యం చేసినప్పుడు శక్తిలేకుండా ఉండటం అనేది సహాజం.
అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోయి, లేదా నిద్రలేమి వల్ల కూడా ఎనర్జీ లేని
అనుభూతిని పొందుతుంటారు కొందరు. మీరు బాగా నిద్రించినప్పటికీ మరియు మీరు
చూడటానికి ఆరోగ్యంగా కనిపించినప్పటీకి శక్తి (ఎనర్జీ)లేనట్లు
కనిస్తున్నారా?
ఎల్లప్పుడూ అలసట మరియు విసుగు చెందడం, శక్తి(ఎనర్జీ)లేకున్నట్లు అనిపించడం ఈ
లక్షణాలకు కొన్ని సందర్భాల్లో ప్రధాన కారణాలు తెలుసుకోలేము. అయితే అలా
ఒక్కసారిగా అలసట మరియు విసుగు పొందడానికి ఈ క్రింది లక్షణాలు కూడా కారణం
కావచ్చు. కాబట్టి శక్తి లేకపోవడానికి ప్రధాన కారణం తెలుసుకొన్నట్లైతే
తప్పనిసరిగా చికిత్స లేదా నివారణ పద్దతులను పాటించవచ్చు.
మరి మీకు శక్తిలేకుండా చేసే ఆ అపరాధి లక్షణాలేంటో ఒక సారి చూద్దాం...
మీలో ఎనర్జీ లేకపోవడానికి 10 ప్రధాన కారణాలు
1/11
నిద్రించే ముందు ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం:
ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్,
టీ.వీ చూడటం లేదా వీడియో గేమ్స్ ఆడటం వంటివి నిద్రించడానికి ముందు చేయడం
వల్ల మీరు అలసటకు గురికాక తప్పదు. దాంతో విసుగు, ఒత్తిడి ఎక్కువౌతాయి.
బ్లడ్ ప్రెజర్ పెరగడం వల్ల మీరు సరిగా నిద్రపోలేరు మరియు గుండె వేగంగా
కొట్టుకోవడం వల్ల నిద్ర పట్టనివ్వదు. కాబట్టి, నిద్రించడానికి కనీసం మూడు
గంటల ముందు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగించడానికి ముందు దూరంగా ఉండాలి.
No comments:
Post a Comment