Tuesday, October 29, 2013

సిని నటి అంజలికి సినిమా కష్టాలు

సిని నటి అంజలికి సినిమా కష్టాలు తీరడం లేదు. ఆమెకు సైదాపేట కోర్టు మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 22 లోపు అంజలిని కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. బెయిల్ కోరుతూ అంజలి తరపు న్యాయవాది వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది. గతంలో అంజలి మిస్సింగ్ సమయంలో తమిళ డైరెక్టర్ కలింజియం వేసిన కేసుకు సంబంధించి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంజలి కనిపించకుండా పోయినప్పుడు డైరెక్టర్ కలింజియం తన సినిమా కోసం ఆమెకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. అయినా అంజలి షూటింగ్ కు హాజరుకాలేదు. దీంతో కలింజియం అంజలిపై సైదాపేట కోర్టులో కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి వాయిదాలకు అంజలి ఇప్పటి వరకు హాజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు వాయిదాలు నడిచాయి. నాలుగు వాయిదాలకు కూడా అంజలి రాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. - See more at: 

No comments:

Post a Comment