Wednesday, October 2, 2013

తెలుగు రేడియో వార్తలకు 75 ఏళ్లు



ఆలిండియా రేడియో (ఎఐఆర్‌)లో తెలుగు వార్తల ప్రసారాలకు 75 సంవత్సరాలు నిండాయి. 1938లో తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతి భాషల్లో ఎఐఆర్‌
వార్తా ప్రసారాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు భాషల వార్తా ప్రసారాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఎఐఆర్‌ మంగళవారమిక్కడ ప్రారంభించింది. ఈ భాషల్లో పనిచేసిన 14 మంది న్యూస్‌ రీడర్లను ప్రసార భారతి సిఇఒ జవహర్‌ సర్కార్‌ ఈ సందర్భంగా సత్కరించారు. తెలుగులో దాదాపు 33 సంవత్సరాల పాటు వార్తలను చదివిన కందుకూరి సూర్యనారాయణ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు.

No comments:

Post a Comment