Tuesday, October 15, 2013

పవర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే యూ ట్యూబ్ లో ప్రత్యక్షమవడం పైరసీ వల్ల కాదని, ఇది కొందరు కావాలని
చేసిన కుట్ర అని పేర్కొన్నాడు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే పవర్ స్టార్ సభాముఖంగా సినిమా ఇండస్ట్రీపై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కసిగా వచ్చాడు...  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా సక్సెస్ మీట్ లకు, ఆడియో ఫంక్షన్లకు ఆమడ దూరంలో ఉంటాడు. దీనికి భిన్నంగా విడుదలైన మూడో వారంలోనే అత్తారింటికి దారేది చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరిగింది. థ్యాంక్యూ మీట్ పేర జరిగిన ఈ క్యార్యక్రమంలో పవన్ తన గళం విప్పాడు. ఎప్పుడూ ఐదు, పది నిమిషాల కన్నా ఎక్కువసేపు మాట్లాడని పవన్ ఈ థ్యాంక్యూ మీట్ లో ఏకంగా అరగంట సేపు మాట్లాడాడు.ఓవైపు సినిమాను సక్సెస్ చేసిన అభిమానులకు , పైరసీపై చర్యలు తీసుకున్న పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూనే..మరో వైపు ఈ పైరసీ వెనుక ఉన్న ఇండస్ట్రీ పెద్దలను హెచ్చరించాడు. పవన్ మాట్లాడిన తీరు చూస్తే...ఒక కసితో సక్సెస్ మీట్ కు హాజరైనట్లు కనిపించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చూస్తే... ఇలా అన్నాడు...  '' కంచే చేను మేస్తుంది అన్న చందంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులే..పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ఇది పైరసీ కాదు కుట్ర . ఈ కుట్ర వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే వారి తాటతీస్తా. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. త్వరలోనే వారి వివరాలు వెల్లడిస్తా. 'అత్తారింటికి దారేదీ' విడుదలకు ముందే పలువురు సినీ పెద్దలు పైరసీ ద్వారా సినిమాను చూశారు. వారిలో కొందరు ఫోన్ చేసి మరీ సినిమా బాగుందని..విడుదలైతే మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్పారు. ఆ సమయంలో నవ్వాలో..ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఈ పైరసీ సినిమాను చూసింది.. ఒకరిద్దరైతే వారి పేర్లు చెప్పేవాడిని..కానీ అలాంటి వారు చాలా మంది ఉన్నారు. పైరసీ చేసిన వారికి, దీని వెనక ఉన్నవారికి ఎలాంటి న్యాయం చేయాలో చేస్తా... ఎవరినీ వదలను. పైరసీని అరికట్టడానికి ప్రయత్నించిన పోలీసులకు, సైబర్ క్రైమ్ వారికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళతాను. ధైర్యం తప్ప నాకు మరే ఆయుధమూ లేదు. అభిమానులే నా బలం''. సక్సెస్ మీట్ సక్సెస్  పైరసీయా..?కుట్రా..? అన్నది పక్కనపెడితే ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకుని సక్సెస్ సాధించిన 'అత్తారింటికి దారేది' తెలుగు సినీ పరిశ్రమకు ఒక 'సక్సెస్ దారి' ని చూపినట్టైంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా..విడుదలైన రెండో రోజు నుండే సక్సెస్ మీట్ లతో అదరగొడుతున్నారు కొందరు సినీ ప్రముఖులు... ఈ నేపథ్యంలో నిజంగానే విశేష ప్రేక్షకాదరణ పొందిన 'అత్తారింటికి దారేది' సక్సెస్ మీట్ జరుపుకోదగ్గ సినిమానే...పవన్ హాజరుతో సక్సెస్ మీట్ సైతం సక్సెస్ అయింది. 

No comments:

Post a Comment