Tuesday, October 8, 2013

కొంచం రిథమ్‌ కలపి చూడండి

   కొవ్వుని కరిగించుకుని శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి  యోగా,నడక,వ్యాయామం,పరిగెత్తడం,స్కిప్పింగ్‌ ఎన్నో మార్గాలున్నాయి.అయితే రోజూ ఒకే విధంగా చేసే ఎక్సర్‌సైజ్‌లంటే
విసుగుపుడితే,ఈ రొటీన్‌కి కొంచం రిథమ్‌ కలపి చూడండి, మీరు ఈ ఎక్సర్‌సైజ్‌ కార్యక్రమాన్ని చాలా బాగా ఆనందిస్తారు. రోజువారీ వర్కవుట్లో సరికొత్త డ్యాన్స్‌ విధానాలను, మూవ్‌మెంట్స్‌ను జోడిస్తే డ్యాన్సర్సైజ్‌ అయిపోతుంది. దీంతో ఎక్సర్సైజ్‌లో కొత్తదనం అనుభవించడమే కాదు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది కూడా.హద్దులు లేని ఆనందాన్ని, తీరైన శరీరాకృతిని మీ స్వంతం చేస్తుంది. మొదలు నుండి చివరి వరకు మీ ఉత్సాహాన్ని ఎక్కడా తగ్గనివ్వదు. ఇంకెందుకు ఆలస్యం డ్యాన్సర్సైజ్‌ మొదలు పెట్టేయడమే.
   ఇతర ఎక్సర్‌సైజ్‌లలానే డ్యాన్సర్సైజ్‌ కూడా మెదడులో ఉండే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఎండార్ఫిన్‌లను ''ఫీల్‌ గుడ్‌'' హార్మోన్స్‌ అని కూడా అంటారు. ఎండార్ఫిన్‌లు విడుదల అయినపుడు ఒత్తిడి నుండి స్వాంతన పొందిన భావన కలుగుతుంది.చాలా శక్తివంతంగా, సానుకూల ధృక్పథంతో ఆలోచించగలిగే శక్తి చేకూరుతుంది.బాల్‌రూమ్‌ డ్యాన్సింగ్‌, సాల్సా, బెల్లీ డ్యాన్సింగ్‌, డాండియా ఇలా డ్యాన్స్‌ ఏదైనా, మనం ఆరోగ్యంగా, ఆనందంగా గడపడానికి, రొటీన్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటే వచ్చే బోర్‌డమ్‌ తగ్గించుకుని మంచి ఫలితాలు పొందడానికి ఈ డ్యాన్సర్సైజ్‌ మ్యాజిక్‌ లాగా పని చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా చలాకీగా, ఉత్సాహంగా మారిపోతారు.నలభై సంవత్సరాల పై బడిన వయస్సులో కూడా యంగ్‌ తరంగ్‌ లాగా మెరిసిపోయే మాధురీ దీక్షిత్‌ రహస్యం డ్యాన్సర్సైజే మరి.
షిబామ్‌
కొంతమంది జిమ్‌లో ఎక్కువ వర్కవుట్‌ చేస్తూంటారు.గంటల తరబడి కష్టపడి చెమటలు కక్కుతూ ఎక్సర్‌సైజ్‌ చేయాలంటే చిరాగ్గా ఉందంటే, బరువులెత్తడం వంటి కష్టమైన పనులకు, పుషప్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి డ్యాన్స్‌ పార్టీ చేసుకోవడమే. షిబామ్‌ ఎవరైనా చేయగలిగే 45 నిముషాల సులువైన డ్యాన్స్‌తో కూడిన వర్కవుట్‌. సులువనే కానీ, ఈ డ్యాన్స్‌లో ఉండే మూవ్‌మెంట్స్‌ను చూస్తే చేయడానికి ఉత్సుకత చూపించకుండా ఉండలేరు. లాటిన్‌ బీట్స్‌, హిప్‌హాప్‌ హిట్స్‌కు సాగే షిబామ్‌ డ్యాన్స్‌ శరీరాకృతిని తీర్చిదిద్దినట్టుగా చేస్తుంది. షిబామ్‌, చాలా సరదాగా సాగిపోయే ఎక్సర్‌సైజ్‌ లాటి డ్యాన్స్‌.ఈ సరికొత్త వైవిధ్యభరితమైన డ్యాన్స్‌ ప్రతి సెషన్‌లో 500 కేలరీలు కరిగిస్తుందట.పెప్పీ సౌండ్‌ ట్రాక్‌ తో చేసే కార్డియో ఆధారిత వర్కవుట్‌లు, అన్ని రకాలైన ఫిట్‌నెస్‌ స్థాయిలకు సరిపోతుంది.
ప్రాన్సర్సైజ్‌
ఈమధ్యకాలంలో ప్రాన్సర్సైజ్‌ వైరస్‌లాగా పాకుతోంది.గురప్రు నడకను పోలి ఉండి, లయబద్దంగా ఛంగుమంటూ దూకుతున్నట్టుగా ఉండే ఈ డ్యాన్స్‌ ఈ మధ్య ఫిట్‌నెస్‌ ఔత్సాహికుల మనసు దోచుకుంటోంది. మీరు ఎప్పుడైనా మూడీగా,దిగాలుగా,నిరాశగా ఉంటే అటువంటప్పుడు ప్రాన్సర్సైజ్‌ నిజంగా ఒక టానిక్కే. మూడ్‌ని రిఫ్రెష్‌ చేసేస్తుంది. దక్షిణ కొరియా సూపర్‌ రాక్‌ స్టార్‌ పార్క్‌ జె సాంగ్‌ ''గంగమ్‌ స్టైల్‌'' ఎంత ప్రాచుర్యం పొందిందో తెలియనిదేం కాదు. ఫాస్ట్‌ బీట్‌తో ఊపున్న డ్యాన్స్‌లు అంతటా సంచలనం సృష్టించేస్తాయి.
జుంబా
జుంబాలో జిప్‌, జాప్‌ జూమ్‌ చొప్పించారు. ఎక్కువ వర్కవుట్‌ చేసినట్టు కాకుండా సరదాగా ఉంటుంది జుంబా. ఎటువంటి క్లాస్‌లు, ఇన్‌స్ట్రక్టర్లు లేకుండానే ప్రపంచ ప్రాముఖ్యం పొందింది. జుంబా డ్యాన్స్‌.ఒక ప్రముఖ కొలంబియన్‌ డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌ అల్బెర్టో తయారుచేసిన డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఇది. జుంబా కొరియోగ్రఫీలో హిప్‌ హాప్‌, సోకా, సామబా, సాల్సా, కుంబియా, ఛఛఛా, రెగేటన్‌, మెరెంగ్‌, మాంబో, టాంగో, ఫ్లామెంకో, మ్యారిటల్‌ ఆర్ట్‌ లు కలిపి ఉంటాయి. నడుము చుట్టు కొలతలో,హిప్స్‌, తొడల ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే జుంబా ఒక మంచి మార్గం. నాజూకైన శరీరం స్వంతం కావాలంటే జుంబా స్టెప్‌లు వేసేయండి మరి. జుంబాలో 8 రకాలైన శైలులు ఉంటాయి. డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ వయసును ,చేయగలిగే సామర్ధ్యాన్ని బట్టి నిర్ణయిస్తారు. 

No comments:

Post a Comment