Tuesday, October 8, 2013

'ప్రేమ' రెండు అక్షరాల ఓ అందమైన పదం



'ప్రేమ' రెండు అక్షరాల ఓ అందమైన పదం. దీనికోసం ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారు. అదే లవ్ కోసం ఎవరినైనా.. ఎదిరించారు. ఇలాంటి ప్రేమలతో వచ్చిన సినిమాలు మనం చాలానే చూసి ఉంటాం. చూడ్డానికి ఆసక్తిని అనిపించినవి కొన్ని
ఉంటే.. నచ్చనివి చాలానే ఉన్నాయి. అయితే సినిమాల్లో ప్రేమలు సక్సెస్ అయినా... నిజ జీవితంలో సక్సెస్ అయినవి చాలా తక్కువనే చెప్పాలి. సినిమాల్లో హీరోహీరోయిన్ల ప్రేమలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అవే వారి రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో మలుపులు తిరుగుతుంటాయి. అచ్చమైన ప్రేమకు అర్థం చెప్పిన నటులే.. తెరబయట దాని అర్థాన్నే మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు.. హీరోలతో లవ్ ఆటలు ఆడుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఏఒక్కరితో స్థిరంగా వారి ప్రేమలు సాగక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హీరోయిన్లు కొద్ది రోజులు ఒకరితో.. మరికొన్ని రోజులు మరో హీరోతో ప్రేమ వ్యవహారాలు నడుపుతూ..చివరికి ఎవ్వరికి కాకుండా పోతున్నారు. మరి వారు సరదా కోసం చేస్తున్నారో.. రియల్ గా చేస్తున్నారో గానీ.. ఇప్పుడు 'ఏ ఇండస్ట్రీలో చూసినా ఏముంది ప్రేమ ఫెయిల్ కు కారణం..' అన్నట్టు తయారయ్యింది హీరోయిన్ల పరిస్థితి. కొన్ని రోజులు ఓ హీరోతో తిరగడం.. మరికొన్ని రోజులు ఇంకో హీరోతో డేటింగ్ చేయడం ఇప్పుడు హీరోయిన్లకు ఫ్యాషనైపోయింది. దీంతో చాలా మంది లవ్ లు ఫెయిల్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేమలో ఉన్నా.. లవ్ ఫెయిల్యూర్ అయినా..టాలీవుడ్ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.. సిద్దుతో సమ్ థింగ్.. అనిపించిన సామ్స్.. సమంతా లవ్ లో పడింది. ఈ స్టేట్ మెంట్ తో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. సామ్స్ ని లవ్ లో పడేసిందెవరు అంటూ ఆరాతియ్యడం మొదలుపెట్టారు. చివరకు అది 'సిద్దు' అని తేలిపోయింది. దీంతో సమంతా సిద్దుల మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ ఉందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సమ్ థింగ్ సమ్ థింగ్ ని నో, నథింగ్ రీప్లేస్ చేస్తున్నాయట. అంటే సమంతా, సిద్దుల లవ్ మేటర్ టెస్ట్ మ్యాచ్ నుంచి ట్వంటీ ట్వంటీకి షిప్ట్ అయ్యిందట. లవ్ లో పడ్డానని చెప్పిన తర్వాత సామ్స్, తెలుగులో సినిమాలు తగ్గించింది. కోలీవుడ్ కే షిఫ్ట్ అయిపోయేలా కటింగ్ ఇచ్చింది బృందావనం బ్యూటీ. కానీ ఇప్పుడు 'అత్తారింటికి దారేదీ'తో బిగ్గెస్ట్ హిట్స్ రావడంతో కొన్నాళ్లు ప్రేమ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చెయ్యాలనుకుంటుందట. దాంతో సమంతా లవ్ కి కొన్నాళ్లు 'కామా' పెట్టోచ్చు అనే టాక్ టాలీవుడ్ లో వినబడుతోంది. కాజల్ కు లవ్ కు నాన్న అడ్డంకిగా మారాడట.. కాజల్: యంగ్ స్టర్స్ అందరితో యాక్ట్ చేసి టాప్ హీరోయిన్ గా వెలుగువెలిగిన టాలీవుడ్ బ్యూటీ..'కాజల్'. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. గ్లామర్ డాల్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టిందంటూ, ఛాలెంజింగ్ రోల్స్ అయితేనే చేస్తానంటూ త్రివిక్రమ్ లెవల్లో డైలాగులు చెబుతోంది కాజల్. కానీ కారణం వేరే ఉందట. అయితే.. కాజల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వాళ్ల నాన్న తోడు వెళ్తున్నాడట. దీనికో లెక్క ఉందట. ఈ మధ్య అమ్మడు ప్రేమపాఠాలు ఎక్కువగా చెబుతుండడం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఓ హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతుండడంతో వాళ్ల నాన్న ఆమె వెంటనే తిరుగుతున్నాడట. కాజల్ లవ్ స్టోరీలో విలన్ తయారయ్యాడట ఆమె ఫాదర్. ప్రేమకు విలన్ గా మారిన హన్సిక.. తమిళతంబీల గుండెల్లో ప్యాలెస్ కట్టుకుని పూజలందుకుంటున్న పాలసోయగం హన్సిక. శింబుతో లవ్వాయనం నడిపిస్తోందట. అంతేకాదు.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయామని ఓపెన్ స్టెట్ మెంట్ వీరిద్దరు. ఈ లవ్ మేటర్ శింబు ఫాదర్ రాజెందర్ కి ఇష్టం లేదనే టాక్ వినిపించినా, పెళ్లిపీటలు ఎక్కడం మాత్రం కన్ఫామ్ అనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ మ్యారేజి ప్రపోజల్ కి హన్సికానే విలన్ లా తయారైందట. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది కాబట్టి మరో 5ఏళ్ల వరకూ పెళ్లిగురించి ఆలోచించే ప్రసక్తే లేదంటోందట హన్సిక. దీంతో శింబు ఈ లవ్ మాటర్ ని షిఫ్ట్ చేసేపనిలో పడ్డాడట. ఏడో సినిమాకు పడిపోయిన ఇల్లీ.. జీరో సైజ్ నడుముతో యూత్ హృదయాలను గుల్ల చేసిన ఇలియానా కూడా లవ్ గురూనే. అవును ఇల్లూ బేబి రెండు లవ్ స్టోరీలతో ప్రేమ ప్రయాణంలో ఫస్ట్ వచ్చింది. ఇలియానా ఏడడుగుల బంధానికి దగ్గర చేసింది ఆమె 'ఏడో సినిమా'నట. ఆ ప్రాజెక్ట్ షెడ్యూల్ స్టార్టింగ్ లోనే సెవెన్త్ సినిమా నాయకునితో లవ్ లో పడిందట ఈ గోవా బ్యూటీ. కానీ ఏడవ హీరోతో మ్యాచ్ అవ్వక ఆ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేసిందని టాలీవుడ్ టాక్. రెండింటిలోనూ.. ఫెయిల్ అయిన నయన్.. గ్లామరెస్ యాక్టింగ్ తో అప్పటివరకూ ఉన్న హీరోయిన్లందరిని మరిచిపోయేలా చేసి, యూత్ ని పిచ్చోళ్లుగా మార్చేసిన హీరోయిన్ 'నయనతార'. ఈ ప్రేమ గజినీల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు శింబు. అయితే వీరి ప్రేమ మధ్యలోనే కట్ అయిపోయింది. దీంతో కొత్తదారి చూసుకొందీ కేరళ అందం. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినా సెకండ్ లవ్ మ్యారేజి వరకూ వచ్చింది. పెళ్లిపీటలు ఎక్కబోతోంది, భాజాభజంత్రీలు మోగుతున్నాయనుకునే టైంలో 'ప్రభుదేవా', నయన్' ల ప్రేమ వ్యవహారం మధ్యలోనే ఆగిపోయింది. కోర్టులు, పోలీసు స్టేషన్లను ఎదుర్కొని మరీ నిలబడ్డ లవ్ కహానీ, ఎవరెస్ట్ లా కనిపిస్తూనే, ఇసుక మేడలా మారిపోయింది. ప్రభు నయన్ ల లవ్వాయణం లాజిక్కులకు కూడా అందకుండా ఎండ్ అయిపోయింది. రూమర్స్ తో సరిపెట్టుకున్న హీరోయిన్స్.. అంతేకాదు.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు లవ్ ఆటలు ఆడిన వారే ఉన్నారు. వీరిలో టాలీవుడ్ సిక్స్ ప్యాక్ బ్యూటీ కూడా ఉంది. అనుష్క నాగ చైతన్యతో ప్రేమలో పడిందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. కానీ దీనికి కింగ్ నాగార్జున ఫైర్ తో ఫుల్ స్టాప్ పడింది. ఐరన్ లెగ్ నుంచి లక్కీ గాళ్ గా మారిన 'శ్రుతిహాసన్' కూడా లవ్వు స్టెప్పులేసిందట. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరో 'సిద్దార్ద్'తో ప్రేమలో పడిపోయింది అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఆ టాక్ మిడిల్ డ్రాప్ అయ్యింది. ఆతర్వాత సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ తో క్లోజ్ గా మూవ్ అయ్యింది అనే న్యూస్ వచ్చింది. కానీ ఈ లవ్ స్టోరీ శతకోటి లవ్వాయణాల్లో ఒకటిగా మిగిలిపోయింది. దాంతో శ్రుతీ హాసన్ ప్రేమకథ కథలానే ఉండిపోయింది. ఇక త్రిషకూడా లవ్ యాణమాడింది. అయితే ఈ చిన్నది ఆరడుగుల అందగాళ్లతో ప్రేమ పాటలు పాడి మధ్యలోనే డ్రాప్ అయ్యిందట.ఈ లిస్ట్ లో కుర్రాకారుకు 'మంత్ర'తో మత్తెక్కించిన ఛార్మి కూడా ప్రేమకోసం తపించిందట. మరి బ్యూటీని మైకం చేసింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అని టాక్. కానీ ఈ ప్రేమ కహానీ మాత్రం స్టార్టింగ్, ఎండింగ్ తేడాలేకుండా ఇంటర్వెల్లోనే ఆగిపోయిందట. సెలబ్రిటీ ఇమేజ్ వచ్చిన తర్వాత, వారి లైఫ్ మొత్తం తెరిచిన పుస్తకమే. అందుకే వారిగురించి తెలుసుకోవాలనే ఉత్సాహం అందరిలోను ఉంటుంది. అదే లవ్ మేటర్స్ అయితే డైనమైట్స్ కన్నా పవర్ ఫుల్ గా పేలుతాయి. సో మన హీరోయిన్లు.. ఇలాంటి ప్రేమలతో తమ సినిమా కెరీర్ ను పాడు చేసుకోకుండా.. సినిమాలపై దృష్టిపెట్టాలని కోరుకుందాం.. - See more at: http://www.10tv.in/news/Tollywood-Heroines-failure-in-Real-life-Love-Trend-Guru#sthash.HMan64Te.dpuf

No comments:

Post a Comment