'నందమూరి' నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరో 'బాలకృష్ణ'. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండు సినిమాలకు కేరాఫ్ బాలయ్య. పాతకాలం హీరో అయినా..
ఇప్పుడున్న కుర్రహీరోలతో పోటీపడుతున్నాడు. కాకపోతే వారికున్నంత గడ్స్ మన 'సింహా'లో తగ్గిపోయాయని టాలీవుడ్ టాక్. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలేవి హిట్ సాధించలేకపోతున్నాయి. ఎప్పుడో.. వచ్చిన 'సింహా' తప్ప ఆ తర్వాత సక్సెస్ అయిన చిత్రం ఒక్కటి కూడా లేదు. దీనికి కారణం తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడట. అంతేకాకుండ ఇంకా.. ఇద్దరుముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే ఆడియన్సే కాదు.. ఫ్యాన్స్ కూడా కష్టంగా ఫీలవుతున్నారు. దీంతో హిట్లు లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇదిలా ఉంటే.. లాస్ట్ హిట్ సింహాను తలచుకుంటూ.. ఇంకా అదే డ్రీమ్ లో ఉన్నాడు బాలయ్య. ఇలా కలలు కంటున్న టైమ్ లో బోయపాటి శ్రీను ఓ మెరుపులా వచ్చి 'లెజెండ్' అనే సినిమా కథ చెప్పాడట. దీంతో శ్రీను ఫిక్స్ అయిన బాలయ్య పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో భారీ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'లెజెండ్' ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి ఈసినిమా అయినా.. బాలయ్యకు హిట్ వరిస్తుందో..? లేదో..? చూడాలి.
No comments:
Post a Comment