మీరు చాక్లెట్ ప్రియులా? నోరూరించే చాక్లెట్ బార్లు తినకుండా మీకు రోజు
గడవదా? అయితే, మీ జేబుకు ఇక చిల్లు పడినట్లే! మీకిష్టమైన చాక్లెట్లు
తినాలంటే, ఇప్పటికన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో
చాక్లెట్ల
ధరలు పెరగనున్నాయి. కొత్తగా వస్తున్న మార్కెట్ల నుంచి కోక్‌కు గిరాకీ పెరగడం, మరో పక్క కోక్‌ను ప్రధానంగా ఉత్పత్తి చేసే దేశాల్లో అస్తవ్యస్తమైన వాతావరణ పరిస్థితులే అందుకు కారణం. వీటన్నిటివల్ల చాక్లెట్ల తయారీలో వాడే పదార్థాలకు అయ్యే ఖర్చు పెరుగుతోంది. అలా ఉత్పత్తి వ్యయం పెరగడంతో, తయారీదార్లు కూడా చేసేదేమీలేక ఆ భారాన్ని వినియోగదారుల మీదకు నెట్టేయాలని నిర్ణయించుకున్నారు.
గడచిన ఏడాది కాలంగా ఈ రకమైన ధోరణి క్రమంగా కనిపిస్తూనే ఉన్నా, రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కానుంది. ఓ సగటు మిల్క్ చాక్లెట్ బార్ ఉత్పత్తి వ్యయం గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగినట్లు పాశ్చాత్య దేశాల్లో లెక్కగట్టి మరీ చెప్పారు. సర్వసాధారణంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అయితే, అటు చాక్లెట్ బార్ ధర అయినా పెంచుతారు. లేదంటే, ధర పెంచకుండా, చాక్లెట్ బార్ పరిమాణమైనా తగ్గించేస్తారు. అమెరికా సంగతే తీసుకుంటే, గడచిన పన్నెండు నెలల్లో రిటైల్ చాక్లెట్ల ధరలు ఏడు శాతం మేర పెరిగాయి. ఈ మొత్తం వ్యవహారంవల్ల హెచ్చు పరిమాణంలో కోక్ ఉండే నల్లటి చాక్లెట్ బార్లు తినే వాళ్ళ జేబులకు చిల్లులు పడనున్నాయి.
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల మార్కెట్ విలువ ఇప్పటికే 11 వేల కోట్ల డాలర్లుంది. దాని విలువ ఏటా ఆరు శాతం మించి పెరుగుతోందని 'యూరో మానిటర్' అంచనా. పైగా, ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికాలలో చాక్లెట్ల మార్కెట్ మరింత వేగంగా విస్తరిస్తోందట! కానీ, కోక్‌ను ప్రధానంగా ఉత్పత్తి చేసే ఐవరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియాలాంటి దేశాల్లో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా, అవి కోక్ రేట్లు పెంచేశాయి. అది చాక్లెట్ల తయారీలో ప్రతిఫలించి, ఇప్పుడు కొనుగోలుదారుల నెత్తినపడుతోంది! అంటే, ఇక ధరలు వింటే చాలు, మనకు చాక్లెట్లు కూడా చేదుగా ఉండనున్నాయన్నమాట!

No comments:
Post a Comment