Wednesday, October 16, 2013

మనిషి మెదడుపై.. మనిషి మెదడు ఒక మిస్టరీ

మనుషులు ఒకరిని ఒకరు కలుసుకోకుండానే మాట్లాడుకోగలరా? కవలల్లో ఒకరికి ప్రమాదం జరిగితే ఇంకొకరికి తెలిసిపోతుందా? ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుందని అంటారా? కానీ కొన్ని ప్రయోగాలు ఇవి నిజమేనని
చెబుతున్నాయి. ప్రపంచమంతా కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో 'టెలిపతి' ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. దీని ద్వారా ఒకరి బాధ మరొకరికి తెలిసిపోతుంది. ఒకరి భారం ఇంకొకరు మోస్తూనే ఉంటారు. సిక్త్స్ సెన్స్, సెవెన్త్ సెన్స్ తో కలుపుకొని దీనికి శాస్త్రవేత్తలు 'టెలిపతి' అనే పేరు పెట్టారు. మనిషి మెదడుపై..  మనిషి మెదడు ఒక మిస్టరీ, అతని ప్రవర్తన ఒక హిస్టరీ .. మనిషి మెదడు గురించి తెలుసుకోవాలంటే ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంకా చేయాల్సింది మిగిలిపోతుంటుంది. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో 7గురు ఉంటారు. కానీ వారు వేరువేరు చోట్ల ఉన్నా ఒకేలా ఆలోచనలు చేయాలి. ఇదెలా సాధ్యమని మనం అనుకుంటాం. అయితే సాధ్యమని చూపి ఆశ్చర్యకరంగా టెలిపతి వ్యవస్థ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొంది. ఓ విచిత్ర ప్రయోగాన్ని చేసింది. అనేక ప్రయోగాలు..  ఒక ఎలుకలోకి ఎలక్ట్రిక్ మైక్రోస్కోపిక్ ఎలక్ట్రోడ్ పరికరాన్ని అమర్చారు. మరొక ఎలుకలో కూడా ఇదే విధంగా చేశారు. రెండింటికీ అనుసంధానంగా ఇంటర్ నెట్ సౌకర్యాన్ని అందించారు. వేర్వేరు చోట్ల ఉన్న ఒక ఎలుక మరొక ఎలుకకు సూచనలను పంపగలిగింది. రెండింటిలోనూ కార్టికల్ న్యూరాన్స్ ప్రతిస్పందనలను పసిగట్టారు. ఈ ప్రయోగం శాస్త్రవేత్తలలో మరింత బలాన్ని పెంచింది. టెలిపతి ద్వారా మనిషి మెదడును చదవచ్చా...?  అనేక మెదళ్లను అనుసంధానం చేసి ఇంటర్ నెట్ లాగా 'బ్రెయిన్ నెట్' ను కూడా సృష్టించవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారాన్ని మార్పిడి చేయవచ్చు. కల్పితం కాదు ప్రయోగాల ఫలితం...  కవలలు, కవలలు కానివారిలో ప్రయోగాత్మకంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. టెలిపతిపై ప్రయోగాలను నిరూపించేందుకు, అమెరికా మిలిటరీ ఆరాటపడుతోంది. రష్యా మిలిటరీ రహస్యాలను తెలుసుకునేందుకు నడుంబిగించింది. అందుకు కొన్ని ప్రయోగాలకు రంగం సిద్ధంచేసుకుంది. సీక్రెట్ ఆపరేష్..   టెలిపతి టెక్నాలజీని సొంతం చేసుకునేందుకు అమెరికా ఆరాటపడుతోంది. గతంలో ఇలాంటి ప్రయోగాలను అనేకం చేశారు. మెక్ మెనిగల్ అనే శాస్త్రవేత్తను అమెరికా ఇంటెలిజెన్స్ సిఐఎ వినియోగించుకొంటోంది. శత్రువులపై నిఘా పెట్టి..శత్రుస్థావరాలను గుర్తించడమే  ఇతని ఉద్యోగం. అమెరికా మిలటరీ ఈ ప్రయోగాలలో పాలుపంచుకొన్నాయి. అమెరికన్ ఆపరేషన్ స్టార్ గెట్స్ లో ఈయన ప్రమేయం చాలా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధంలోనే అమెరికా ఈ టెలిపతి కోసం ప్రయోగాలు చేసింది. సోవియట్ యూనియన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తాను ప్రయత్నించినట్లు మెక్ మెనిగల్ చెప్పాడు. మిస్సైల్, సబ్ మెరైన్ కు సంబంధించిన విషయాలను అమెరికా ఇంటలిజెన్స్ అధికారులకు చేరవేశానని ఆయనే తెలిపారు. వీటిపై పరిశోధనల కోసమే అమెరికా సైన్యం స్టార్ గేట్స్ ఆపరేషన్ ను కొనసాగిస్తుందని ప్రపంచమంతా అనుమానిస్తోంది. దీనికోసం అమెరికా భారీగా ఖర్చు పెడుతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరికొందరు దీనిపై కోట్లు కుమ్మరిస్తున్నారని వాదిస్తున్నారు. కానీ 'టెలిపతి' ఉందని తేల్చి చెప్పి నిలబడే పరిస్థితి ఇంకా రావడం లేదు. కవలల అనుభావాలు వింటే టెలిపతి నిజమేననిపిస్తుంది. కానీ దీనికి ఖచ్చితమైన సిద్దాంతాలు కనుక్కోలేక పోయారు. కొందరు సైకాలజిస్టులు ఇదంతా ఉట్టి ట్రాష్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. పారా శాస్త్రవేత్తలు మాత్రం నిగ్గు తేల్చుతామని అంటున్నారు. 

No comments:

Post a Comment