Sunday, October 6, 2013

'ఒన్ బ్యానర్, ట్రోఫీ బ్యానర్'


నవీన్, శశికుమార్, అమిత్ సింగ్, ఆశా, బిందు' ప్రధాన పాత్రల్లో 'ఒన్ బ్యానర్, ట్రోఫీ బ్యానర్' పై ఓ కొత్త సినిమా రూపొందుతోంది. విమల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రోగ్రెస్ ను చిత్ర యూనిట్ శనివారం మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ....'' ఎక్స్ లెంట్ కథ. ఈ రోజుల్లో ఓ కథను ఇలా కూడా చేయోచ్చని ఆలోచన కల్గుతుంది. దీనిలో నలుగురు కుర్రాళ్లు ఉంటారు. వారు తమ గోల్ ను రీచ్ కావడం కోసం ఏం చేశారనేది సినిమా కథ. సినిమాకు త్వరలో పేరు పెడతాం'' అని అన్నారు. నటీనటులు మాట్లాడుతూ... 'ఈ సినిమాతో మాకు లైఫ్ వస్తుందని భావిస్తున్నాము. ఇండస్ట్రీలో నిలబడడానికి ఇది మాకు మంచి అవకాశం. ఈ సినిమాను దర్శకుడు, నిర్మాతగాని ఓ యజ్ఞంలా చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు థ్యాంక్స్'' అన్నారు.

No comments:

Post a Comment