కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్త్రీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా చెబుతోంది. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.
కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ ఫ్రాన్ అంటారు. ఇది జాఫరాన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది. అంతే కాదు మంచి సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల అనేక వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఉదా: పుడ్డింగ్ లేదా క్యారెట్ హాల్వాలో ఉపయోగిస్తుంటారు. మరియు ఫెర్ ఫ్యూమ్స్ లో విరిగా వాడుతుంటారు.
గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, బట్టతల, మలబద్దకం, క్యాన్సర్, నిద్రలేమి మరియు మరికొన్ని ఇతర జబ్బుల బారిన పడకుండా సహాయపడుతుందని చెబుతుంటారు. మరియు రుతుక్రమ తిమ్మెరలను తగ్గించి మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇంకా డిప్రెషన్ మరియు నిద్రలేమితో బాధపడేవారికి కుంకుమ పువ్వు మంచిది. అంతే కాదు, అనేక బ్యూటీ ట్రీట్మెంట్స్ లో కూడా దీన్ని విరివిగా ఉపయోగించారు. అనేక ఫేస్ ప్యాక్స్ మరియు కాస్మోటిక్స్ లో ఉపయోగించి చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికి ఉపయోగిస్తుంటారు. మరి మీరు కూడా దీని ప్రయోజనాలు పొందాలంటే మీ కుంకుమ పువ్వును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే ఒక గ్లాసు పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి తీసుకోవచ్చు. మరి కుంకుమ పువ్వులో ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలేంటో చూద్దాం..
No comments:
Post a Comment