Thursday, November 21, 2013

కృష్ణ నో చెప్పడం వెనక...

కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్-వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కబోయే చిత్రంలో సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించడానికి ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడిన సంగతి తెలిదే. అయితే ఉన్నట్టుండి ఎందుకనో కృష్ణ తప్పుకున్నాడు. అయితే ఈ విషయమై తాజాగా ఫిల్మ్ నగర్లో ఆ సక్తికర రూమర్ వినిపిస్తోంది. మహేష్ వద్దని చెప్పడం వల్లనే కృష్ణ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తన తండ్రికి అలా ఎందుకు చెప్పారు? అనేది ఇపుడు చర్చనీయాంశం అయింది. బహుషా పోటీ తత్వమే ఇందుకు కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
కృష్ణ తప్పుకోవడంతో ఆయన స్థానంలో తమిళ నటుడు రాజ్ కిరణ్‌ను ఎంపిక చేసారు. చాలా కాలంగా సరైన హిట్ లేని దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని ఆశ పడుతున్నారు. ఇందుకోసం కథ, స్క్రిప్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్లో జరుగనుందని తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరనుంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు కృష్ణ వంశీ. హీరోయిన్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

No comments:

Post a Comment