Tuesday, November 5, 2013

పాదాలు & అరచేతులు మృదువుగా ఉంచే..

సాధారణంగా కొందరి చర్మం పరిశీలించినట్లైతే చాలా పొడిగా మరియు పగుళ్ళతో కూడా ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సూర్యకిరణాల నుండి
వెలువడే ఆల్ట్రా వయోలెట్ కిరణాలు(యువి) మరియు వాతావరణ పరిస్థితులు, కాలుష్యం వంటివి చర్మం మీద ప్రభావం చూపెడుతాయి. యూవీ కిరణాలు మరియు కాలుష్యం కాకుండా, చేతులు, అరచేతులు, పాదాలు కొన్ని రసాయనాల మరియు సోపుల వల్ల కూడా మరింత కఠినంగా మారుతుంది. శీతాకాలంలో చాలా చల్లని వాతావరణం మరియు శీతాకాలంలో పొడి గాలుల వల్ల స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలోనూ అరచేతుల్లో మరియు పాదాల్లో పగుళ్ళు ఏర్పడుతాయి. ఎందుకంటే శీతాకాలంలో మరీ చల్లగా మరియు మరీ లోటెంపరేచర్ ఉన్నా కూడా చర్మం తట్టుకోలేదు. వెంటనే చర్మంలో మార్పుటు సంభవిస్తాయి. శీతాకాలంలో పాదాలను మరియు అరచేతులను సాఫ్ట్ గా మార్చుకోవడం కోసం ప్రతి ఒక్కరికీ ఒక సవాలు వంటిదే.... అయితే, కొన్ని వారాల పాటు ప్రతి రోజూ సహజ మరియు ఆరోగ్యవంతమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల చర్మంలో కఠినత్వాన్ని తొలగించుకోవచ్చు. మీ పాదానలు మరియు అరచేతులను సాఫ్ట్ గా మార్చుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ లో ఉన్న చిట్కాలను పాటించడం ద్వారా ఎక్కువగా సహాయపడుతాయి.. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం.. మృదువైన పాదాలు-చేతుల కోసం ఉత్తమ చిట్కాలు1/8 గోరువెచ్చని నీటిలో కొంత సమయం నాననివ్వాలి: గోరువెచ్చని నీటిలో పాదాలు కానీ, అరచేతులను కానీ కొద్ది సమయంలో నానబెట్టడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. మంచి ఫలితాలను పొందాలంటే పాదాలను మరియు అరచేతులను 10నిముషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. గోరు వెచ్చని నీటిలో పాదాలను మరియు అరచేతులను పెట్టడం వల్ల కొంత పొడిబారవచ్చు.


No comments:

Post a Comment