Friday, November 1, 2013

చర్మం దురద తగ్గించటానికి సులభమైన హోం రెమిడీస్

సాధారణంగా దురద అనేది ఇబ్బందికరముగా ఉండే ఒక సమస్య అని చెప్పవచ్చు. దురద రావటానికి అలెర్జీలు,పురుగులు కుట్టడం,వాతావరణ కాలుష్యం,అంటువ్యాధులు,సబ్బుల్లో కఠినమైన రసాయనాలు
మరియు మందుల వంటి కారణాల వలన రావచ్చు. దురద సమస్య చాలా బాధకరముగాను మరియు చాలా చికాకుగాను ఉంటుంది. ఆ క్షణంలో ప్రభావిత ప్రాంతంలో గోకడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ ఇలా చేయుట వలన చర్మ వ్యాధికి దారి తీయవచ్చు. మీరు చర్మం దురదతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా గోకడం మాత్రం చేయకూడదు. చర్మంను గోకడం వలన నష్టం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాక కొన్నిసార్లు ప్రమాదకరమైన అంటురోగాలకు దారి తీస్తుంది. అటువంటి సందర్భంలో దురద ప్రాంతంలో గోకడం ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. కొన్ని ఇతర సురక్షిత నివారణ మార్గాలను పాటించాలి. మీరు ఉపశమనం కొరకు ఈ నివారణ మార్గాలను పాటించటం చాలా సులువైనది. ఎందుకంటే ఇవి మీ వంటగది అల్మరాలో అందుబాటులో ఉంటాయి. చర్మం దురద కోసం ఈ సాధారణ గృహ నివారణ మార్గాలు వంద శాతం సురక్షితం అని చెప్పవచ్చు. అంతేకాక మీ చర్మంనకు ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. చర్మం దురదకు సాధారణ గృహ పరిష్కారాలు ఉన్నాయి.
బేకింగ్ సోడా   బేకింగ్ సోడా చర్మం దురదకు చాలా సాధారణమైన హోమ్ పరిష్కారాలలో ఒకటిగా ఉంది. ఇది ఒక సహజ ఆమ్ల న్యూట్రలైజ్ వంటి శోథ నిరోధక లక్షణాలు మరియు చర్యలు కలిగి ఉంటుంది. నీటి యొక్క ఒక భాగాన్ని బేకింగ్ సోడా యొక్క మూడు భాగాలతో కలిపి ఒక పేస్ట్ గా చేయండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతాలలో రాసి అర గంట సమయం అయిన తర్వాత నీటితో కడగాలి. అయితే మీరు బేకింగ్ సోడాను పగిలిన చర్మం లేదా ఓపెన్ గాయాలకు ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి.

No comments:

Post a Comment