Tuesday, November 19, 2013

స్పెషల్ సైడ్ డిష్ ...

 సాధారణంగా, మధ్యాహ్నా భోజనానికి కానీ, లేదా డిన్నర్ కు కానీ ఎదైనా స్పెషల్ గా తయారుచేసుకోవాలనుకున్నప్పుడు, ఇటువంటి సింపుల్ ట్రీట్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ చైనీస్ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. మరియు చాలా సులభం కూడా. ఈ వెజిటేరియన్ రిసిపిని బంగాళదుంపలతో తయారుచేస్తారు. మీ నోటిని మరింత రుచికరంగా మార్చే ఈ చైనిస్ వంటలు అద్భుతంగా ఉంటాయి. సాధారణంగా మీరు చిల్లీ చికెన్, చిల్లీపెప్పు మరియు ఇతర డిష్ లను వినే ఉంటారు. మనం బంగాళదుంపలను ఒకే పద్దతిలో తయారుచేసి చాలా బోరుకొడుతుంటుంది. కాబట్టి ఇటువంటి చైనీ స్పెషల్ డిస్ ను ప్రయత్నించి ఒక కొత్త టేస్ట్ ను రుచి చూడండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చేయండి.
బంగాళ దుంపలు: 5(పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి) కార్న్ ఫ్లోర్: 2tbsp ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి) కాప్సికమ్: 1 (సన్నగా కట్ చేసుకోవాలి) వెల్లుల్లి పాయలు: 6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) అల్లం- వెల్లుల్లి పేస్ట్: 2tsp అజినోమాటో: ఒక చిటికెడు ఉప్పు: రుచికి సరిపడా ఎండు మిర్చి: 1tsp(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పచ్చిమిరపకాయలు: 4 (మద్యలోకి చీల్చి పెట్టుకోవాలి) గ్రీన్ చిల్లి సాస్: 1tsp సోయా సాస్: 1tbsp టమోటా సాస్: 2tbsp చిల్లీ వినెగార్: 1tsp నూనె: 2tbsp నూనె: ఫ్రై చేయడానికి సరిపడా నీళ్ళు : ¼cup తయారుచేయు విధానం: 1. ముందుగా బంగాళదుంపలను పొట్టుతీసి, చాలా పల్చని స్లైస్ గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన బంగాళదుంప ముక్కలను 5నిముషాలు ఉప్పునీటిలో వేసి, నానబెట్టుకోవాలి.
 2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ మరియు ఉప్పు, నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి. 3. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి నూనె పోసి వేడి అవ్వనివ్వాలి. 
4. బంగాళదుంపలను నానెబెట్టిన ఉప్పునీటిని వంపేసి, ఆ ముక్కలను చిక్కగా కలిపి పెట్టుకొన్న కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసి, కాగే నూనెలో వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
 5. ఇలా అన్ని బంగాళదుంప ముక్కలను ఫ్రై చేసుకొన్న తర్వాత, వాటిని పక్కన పెట్టుకోవాలి. 
6. తర్వాత మరో ఫ్రైయింగ్ పాన్ లో రెండు చెంచాల నూనె వేసి వేడి చేసి అందులో వెల్లుల్లిపాయలుమరియు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
 7. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి మరో 3నిముషాలు వేగించుకోవాలి.
 8. ఇప్పుడు అందులోనే అజినోమోటో, ఉప్పు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
 9. తర్వాత అందులో సోయా సాస్, టమోటో సాస్, పచ్చిమిర్చి సాస్, చిల్లీ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
 10. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
11. ఇలా ప్రొసెస్ అంతా పూర్తి అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి. ఈ స్పైసీ మరియు టాంగీ చిల్లీ పొటాటోను ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ తో సర్వ్ చేయవచ్చు.

No comments:

Post a Comment