Monday, February 3, 2014

రోజూ నారింజ పండు తినడం వల్ల మానసిక వికాసం...

రోజూ నారింజ పండు తినడం వల్ల మానసిక వికాసం, శరీరానికి కావలసిన ఉత్సాహం, ఉల్లాసం లభిస్తాయి. అందుకే తక్షణ శక్తి కోసం నారింజ పండు
తినడం ఉత్తమ మార్గం. క్రీడాకారులు ఎక్కువగా తక్షణ శక్తి కోసం నారింజను ఆశ్రయిస్తుంటారు. ప్రతి ఒక్కరూ రోజుకు రెండు, మూడు నారింజ పండ్లను తీసుకోవడం వల్ల తక్షణశక్తితో పాటు రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభించే నారింజ పండును రసం తీసుకొని తాగవచ్చు. లేదంటే, పండుగా తినవచ్చు. కానీ, ఎన్నో సుగుణాలున్న, ఎంతో రుచికరమైన నారింజను అల్పాహారంగా తీసుకోవడానికి ఎంత మంది ఇష్టపడతారంటే సందేహమే. రోజుకొక యాపిల్‌ తినడం వల్ల డాక్టర్‌ అవసరమే కలగకపోవడం ఎలా సాధ్యమో, అలాగే రోజుకొక నారింజ పండు తినడం వల్ల చర్మ డాక్టర్‌ల అవసరం రాదు. అందుకే యవతరం ముఖ్యంగా అమ్మాయిలు రోజుకొక నారింజ పండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మపు నిగారింపు, ప్రకాశవంతమైన మెరుపు సొంతమవుతుంది. నారింజ పండు వల్లే కాక నారింజ తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉబ్బసాన్ని నియం త్రించడంలో, చర్మ అలర్జీలను, ఇన్‌ఫెక్షన్లను నివారించ డంలో అది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉపయోగపడే మానవ శరీరంలోని ఫితోన్యూట్రియట్‌ ఎక్కువగా ఉండే పండు నారింజ. పైగా ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కూడా.క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధుల నివారణకూ, రక్త పోటును క్రమబద్ధీకరించడానికీ, ఆరోగ్యవంతమైన గుండెకూ నారింజ పండు ఎంతో ఉపయోగపడుతుంది. వైద్యశాస్త్ర ప్రకారం కీళ్ళ నొప్పులకు, ఎముకల వ్యాధికి, కీళ్ళ వాతం వ్యాధికి ఉపశమనం చేకూర్చే గుణాలు ఎన్నో ఈ నారింజలో ఉన్నాయి. ప్రపంచంలో 80శాతం మంది విటమిన్‌ ఎ, డి లోపంతో బాధపడుతున్నారు. ఈ విటమిన్ల లోపం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే రికెట్స్‌ వ్యాధి, దాని వల్ల వచ్చే నీరసం, కాళ్ళలో పటుత్వం లేకపోవడం, దాని వల్ల నడుస్తూ నడుస్తూనే పడిపోవడం, ఎముకలకు ఆకారం లేకపోవడం లాంటివి సంభవిస్తాయి. అందుకే రోజుకొక గ్లాసు నారింజ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి. మానవ శరీరంపై ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. పీచు ఎక్కువగా గల ఈ నారింజ పండు పేగుల లోని సమస్యలను తగ్గిస్తుంది. విసర్జనలోని ఇబ్బందుల్ని నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా శాచ్యురే టెడ్‌ కొవ్వులు లేని నారింజ ఎంతో ఉపయోగకరం

No comments:

Post a Comment