డార్క్ సర్కిల్స్ (కళ్ళ చుట్టు, నల్లని వలయాలు)ఆకర్షణీయంగా లేని ఒక లోపం.
ఇది పురుషుల్లో కూడా వారి అందాన్ని తగ్గిస్తుంది. చాలా సందర్భాల్లో నల్లని
వలయాలకు ప్రధానకారణం అనారోగ్య జీవనశైలి. నల్లని వలయాలకు మరికొన్నిఇతర
కారణాలు సూర్యరశ్మి, తగినంత నిద్రలేకపోవడం, నీరు తగినంత త్రాగకపోవడం మరియు
కళ్ళను తరచూ రుద్దడం, జన్యుశాస్త్రీ కారణం అనిచెప్పవచ్చు.
నల్లని వలయాలకు కారణాలు తెలుసుకొన్నట్లైతే వాటిని నివారించండానికి
సమర్థవంతంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధిక
ఒత్తిడి మరియు నిద్రలేమి వల్ల కళ్ళ క్రింది నల్లని వలయాలకు ముఖ్యకారణం
అవుతుంది కాబట్టి, మీ జీవనశైలిలో మార్పలు చేసుకోవడం ఎంతైన ఉంది.

No comments:
Post a Comment