ధూమపానం ఆరోగ్యానికి హానికరము అని మనకు తెలిసిన విషయమే! ప్రస్తుతం ఇతర
దేశాల పాటు మన దేశంలో కూడా ప్రతి సంవత్సరం ధూమపానం వల్ల వివిధ క్యాన్సర్ల
వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ల వల్ల చనిపోయేవారు కొన్ని వేలల్లో
ఉన్నారు. అయితే, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో స్మోకింగ్ చేయడం ఒక స్టైల్
స్టేట్ మెంట్ అయింది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా మంది హీరోలు కూడా
స్టైల్ గా స్మోక్ చేస్తూ కనబడటం, వారి అభిమానులను కూడా ప్రభావితం
చేస్తుంది. వారి ఫ్యాన్స్ అదే స్టైల్ ను ట్రెండ్ ను సరదాకో, లేదా బెట్ కోసం
ప్రయత్నించి అలావాటుగా మార్చుకొనే వారు కొందరైతే మరికొందరు ఒత్తిడి
తగ్గించుకోవడానికి అని కొట్టిపడేస్తుంటారు.
ఏదైతేనేం పొగరాయుళ్ళతో పోరాడి వారి వద్ద స్మోకింగ్ మానిపించడం కొంచెం కాదు,
చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం పాశ్చత్య పోకడల లైఫ్ స్టైల్ ఎక్కువగా మన
దేశంలో కూడా పెరిగింది. చాలా వేగంగా ట్రెండ్ మారుతోంది, ఇటువంటి సమయంలో మన
టాలీవుడ్ హీరోలు కొందరు, ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడానికి స్మోకింగ్ స్టైల్
ను క్రియేట్ చేశారు. ఒక్కో హీరో ఒక్కో స్టైల్లో డిఫరెంట్ స్మోకింగ్ స్టైల్
కలిగిన స్టిల్స్...

No comments:
Post a Comment