Sunday, February 9, 2014

ఆకర్షణీయ చీర కట్టులో ప్రియాంకా చోప్రా !

అంగ సౌష్టవం, అదిరేటి లుక్ గల అంతర్జాతీయ సినీ భామ ప్రియాంక చోప్రా, జీ సినీ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ పై పూర్తి దేసీ లుక్ ఇచ్చింది. అచ్చమైన భారతీయ
యువతిగా పేరుపడ్డ ప్రియాంక చోప్రా ఆకర్షణీయ చీర కట్టులో ఆడియన్సు ను మంత్ర ముగ్ధులను చేసింది. బంగారు, తెలుపు రంగులు కల సాంప్రదాయ చీర కట్టి ఆమె రెడ్ కార్పెట్ పై నడుస్తూంటే, ప్రదేశం అంతా వెలుగులు విరజిమ్మాయి. జీ సినీ అవార్డ్స్ 2014 లో తాను దేసీ లుక్ లో కనపడాలనే ఆమె నిర్ణయం సరైనదని అనిపించింది. రెడ్ కార్పెట్ పై తెలుపు, బంగారు రంగులు కల ఆమె చీర ప్రేక్షకులకు మరపురాని అనుభూతులు పంచింది. తెల్లటి చీరపై మెరిసే బంగారు డిజైన్ లు ఆ చీర గోల్డెన్ వైట్ అనే భ్రమను కలిగించాయి. దట్టమైన నియాన్ ఇంకు బోర్డర్ లు మంచి స్టైలిష్ లుక్ ఇచ్చాయి. 2014 జీ సినీ అవార్డుల ప్రోగ్రాం లో ఇంటర్నేషనల్ సింగర్ గా గెలుపు పొందిన గ్రేట్ ప్రియాంక చోప్రా తాను కట్టిన చీరపై మాచ్ అయ్యే కేప్ స్లీవ్ గోల్డెన్ బ్లౌస్ ధరించింది. గౌన్ కేప్ స్లీవ్ లు బంగారు రంగులో దగా దగా మెరిసి పోయాయి
.
జీ సినీ అవార్డ్స్ 2014
 ప్రియాంక చోప్రా చీర కట్టు సైతం విభిన్న రీతి లో వుంది దానిపై కల బంగారు రంగు డిజైన్ లు మరింత మెరిసాయి. ఆమె గుండే సినిమా లోని పాత్రను ధరించిందా ? అని ఒక్క క్షణం అనిపించింది. అందమైన చీర కట్టు, పెద్ద నల్లని బొట్టు, చెవులకు బంగారు లోలకులు, తీర్చి దిద్దిన కన్నుల మేక్ అప్ ఇవన్నీ ఆమె రాబోయే చిత్రం లోవా అని అనిపిస్తోంది. మొత్తంగా ఈ నటీమణి ఈ ప్రదర్శనలో అందంగా మెరిసి పోతూ వుంటే, ఈ మాజీ ప్రపంచ సుందరి పై నుండి కన్నులు ఎలా మరల్చాలా అని అందరికి అనిపించింది. ఎంతో కాలం తరవాత రెడ్ కార్పెట్ పై ఒక భారతీయ కట్టు బొట్టు కల సౌందర్యవతిని చూసాము. గతంలో ఫిలిం ఫేర్ అవార్డ్ ల ప్రదర్శనలో ఆమె నల్లని గౌను ధరించి ఎంతో సెక్సీ గా కనపడగా నేడు ఆమె అచ్చమైన భారతీయ మహిళా కట్టు బొట్టు తీరులో ప్రదర్శన ఇచ్చింది.

No comments:

Post a Comment