డెస్క్ జాబ్ అంటే మన దృష్టిలో కూర్చుని చేసే ఉద్యోగమే. మనలో చాలా మంది 9
నుండి 5 గంటల వరకు పనిచేస్తే అది ‘నార్మల్' లేదా మన జీవితంలో మరింత
ఎక్కువగా పనిచేయడం అవసరంగా మారుతోంది. బయట తిరగకుండా నీడపట్టున కూర్చుని
పనిచేసుకోవచ్చనే పాజిటివ్ యాంగిల్ కూడా డెస్క్ జాబ్‌కి ఉంది. ఆ
పాజిటివ్ అంశమే నేడు నెగెటివ్‌గా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని
ఉద్యోగాలు చేసే వ్యక్తుల్లో అనారోగ్యాలు సైతం తిష్టవేస్తున్నాయి.
ఆఫీస్ ఉద్యోగాలు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో అనేక
ఆరోగ్య ప్రమాధాలతో సంబంధం కలిగి ఉన్నాయి. డెస్క్ జాబ్ వల్ల ముఖ్యంగా అనేక
క్రోనిక్ హెల్త్ ప్రాబ్లమ్స్: వెన్నునొప్పి, కీళ్ళ నొప్పుల మరియు ఊబకాయం
వంటి ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది. డెస్క్ జాబ్ వల్ల వచ్చే ఈ హెల్త్
ఎఫెక్ట్స్ చాలా మందిలో చాలా క్రిటికల్ గా ఉంటాయి. చాలావరకూ చదువుకున్న వారు
ఆఫీస్ ఉద్యోగాలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేసుకుంటారు.
డెస్క్ జాబ్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా, ఈ విషయంలో
చదువుకొన్న వారికి అంత కంటే మంచి ఛాయిస్ మరోకటి ఉండదు. అయితే, ఆఫీస్ జాబ్స్
వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల
సహాపడుతుంది. అందువల్ల, ఆ ముందుజాగ్రత్తలు తీసుకోవడానికి కంటే ముందు,
డెస్క్ జాబ్స్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి.

No comments:
Post a Comment