Tuesday, April 15, 2014

కండరాల నొప్పి నివారించే బెస్ట్ హోం రెమెడీస్


ఏదో ఒక దశలో ప్రతివారిలోనూ కండరాల నొప్పి కనిపించడం సహజం. రోజువారీ పనివల్ల లేదా పనిభారం పెరగటం వల్ల వచ్చే కండరాల నొప్పితో సతమతం అవుతున్నవారు ఎందరో ఉన్నారు. అయితే శరీర కదలికలను, అవసరాలను ఏర్పాటు చేసి ముఖ్య అవయవాలను కాపాడే కండరాల నొప్పిని లోపల జరిగే అసమతుల్యత, అనారోగ్య లక్షణాలను తెలియజేసే సూచికలుగా భావిస్తారు. మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్, ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.
కారణాలు: గాయాలు, కండరాలుపై ఎక్కువ ఒత్తిడి ఉదాహరణకు వ్యాయామం, శారీరక శ్రమ అధికంగా ఉండటం. 
2. శరీరంలో పొటాషియం, కాల్షియం మోతాదు తగ్గడం. 
3. ఏసీఈ ఇన్‌హిబిటర్స్, బి.పి కి వాడే మందులు, కొకైన్, స్టాటిన్స్ అంటే శరీరంలో కొవ్వుని తగ్గించే మందులు వాడటం వలన రావచ్చు. 
4 ఇన్‌ఫ్లూయెంజా, మలేరియా, కండరాలపై గడ్డలు, పోలియో వంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల రావచ్చు. 
5. ఫైబ్రోమయాల్జియా, డెర్మటోమైటోసిస్ వంటి వ్యాధుల వల్ల వచ్చే అవకాశం ఉంది. 6. కండరాల వాపు, నొప్పి, తొందరగా అలసిపోవడం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి మందగించడం, శరీరం సన్నబడటం వంటి లక్షణాలుంటాయి. కదలికలు కష్టంగా మారతాయి. కండరాల నొప్పి నివారించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు: 1/11 కండరాల నొప్పికి కారణాలను తెలుసుకోండి: మజిల్స్ పెయిన్ నొప్పికి హోం రెమడీస్ ఉపయోగించడానికి ముందు, నొప్పిక గల కారణాలను తెలుసుకోవాలి. అప్పుడే వెంటనే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment