Thursday, April 17, 2014

గుడ్డు వాసను మాయం...

 మన నిత్యవసర వస్తువుల్లో, నిత్యవసర ఆహారపదార్థాల్లో ఒకటి గుడ్డు. ప్రస్తుత రోజుల్లో గుడ్డులోని అనేక పోషక విలువ గురించి తెలుసుకోవడం వల్ల అనేక మంది
వారి రెగ్యులర్ డైట్ లో గుడ్డును ఒక ప్రధాన ఆహారపదార్థంగా చేసుకున్నారు. కొంత మంది శాహారాలు కూడా గుడ్డను తింటూ ఎగ్ టేరియన్స్ గా చేప్పుకుంటుండం మన చుట్టూ చూస్తూనే ఉంటాం. అయితే ఈ పోషకాహారాన్ని తినడం ఒకపనైతే, వీటిని నిల్వ చేయడం మరో ఎత్తు. ఎందుకంటే జాగ్రత్తగా పెట్టకుంటే, క్రిందపడి పగలడం జరుగుతుంది. దాంతో దుర్వాస వస్తుంది. వాసను పోగొట్టడం కొంచెం కష్టమైన పనే. అలాగే మనం తయారుచేసిన పాత్రలు, మనం ఉపయోగించిన ప్లేట్స్ కూడా వాసనతో కూడి ఉంటాయి. టేబుల్ టాప్స్ మీద మరియు రిఫ్రిజరేటర్ లో కూడా ఉంటుంది. ఈ వాసన కాస్త అసౌకర్యానికి గురిచేస్తుంది. అందుకు కొన్ని నేచురల్ పద్దతులను ఉపయోగించి, గుడ్డు వాసనను తొలగించుకోవచ్చు. గుడ్డు పగిలి క్రిందపడినప్పుడు, లేదా పాత్రలకు అట్టుకొన్నప్పుడు వెంటనే శుభ్రం చేయకపోతే, కెమిక్ గ్యాస్ హైడ్రోజన్ ఉత్పత్తై బ్యాక్టీరియా చేరి దుర్వాసన మరింత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, గుడ్డు వల్ల వచ్చే దుర్వాసను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి... 1. నిమ్మరసం: నిమ్మరసంతో గుడ్డు వాసను దూరం చేయవచ్చు. గుడ్డ పడ్డ మరకల మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించండి. రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే తక్షణం వాసన పోతుంది. 2. రోజ్ వాటర్: గుడ్డు పడ్డ చోట బాగా ఎండిపోయి, మొండి మరకలుగా తయారైతే రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం ఒక సులభమైన పద్దతి. అంతే కాదు, రోజ్ వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంటుంది. 3. వెనిగర్: ఎగ్ స్మెల్ నిర్మూలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఎఫెక్టివ్ మార్గం. అందుకు మీరు చేయాల్సిందల్లా, వెనిగర్ లో కాటన్ క్లాత్ ను డిప్ చేసి, మరకపడ్డ ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే దుర్వాసన మాయం అవుతుంది. 4. ఆరెంజ్ తొక్క: ఎగ్ స్మెల్ తొలగించడానికి ఆరెంజ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ సువాసన అందించే బెస్ట్ హోం రెమడీ. ఆరెంజ్ తొక్కతో ఎగ్ మరకలున్న చోటో రుద్ది శుభ్రం చేయాలి.


No comments:

Post a Comment