Monday, May 19, 2014

ఫోర్ హెడ్(నుసటన)జుట్టురాలడం...

సౌందర్యంతో పాటు కురులకు కాపాడుకోలేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జుట్టు రాలిపోయి అసౌకర్యంగా.. అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఉన్న జుట్టు ఊడిపోకుండా, చుండ్రు లేకుండా కురులను ఆరోగ్యంగా కాపాడుకొన్నట్లైతే అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది. ముఖ్యంగా ఫోర్ హెడ్(తల నుదిటి బాగంలో చాలా మంది అతి త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. లేదా ఫోర్ హెడ్ దగ్గర కురులు పెరగకుండా అలాగే ఉండిపోయి నుదిటి బాగం ఎక్కుగా కనబడేలా చేస్తుంది. అంతే కాదు క్రమంగా అది అలాగే పెరుగుతుంటే, అది కాస్త బట్టతలగా మార్పు చెందుతుంది. అందుకు ప్రధాన కారణం జీన్స్, న్యూట్రీషియన్ లోపం వల్ల నుదిటి భాగంలో జుట్టు రాలవచ్చు. కాబట్టి జుట్టు రాలిపోకుండా కాపాడి, జుట్టుపెరిగేలా చేసే కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది జుట్టు రాలిపోతుందని గాభరా పడి హెయిర్ ట్రీట్మెంట్ లకు అనవసరమైన డబ్బును వృధా చేస్తుంటారు. అటువంటి అవసరం లేకుండానే సహజపద్దతులను ఉపయోగించి ఇంట్లో కురుల పెరుగుదలకు చక్కటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అందమైన, దట్టమైన మీ కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఆయిల్ మసాజ్ నుండి హెయిర్ ప్యాక్ ల వరకూ జుట్టు పెరుగుదలకు వివిధ మార్గాలను ప్రయత్నించి, నుదిభాగంలో కప్పిఉంచేలా జుట్టును పెంచుకోవచ్చు. వీటిని పాటించడంతో పాటు డైట్ ప్లాన్ ఉదా: ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇతర జుట్టు నష్టాన్ని తగ్గిస్తాయి. విటమిన్లలోపం, అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ మరియు హెయిర్ కేర్ లో అశ్రద్దం వల్ల జుట్టు రాలడానికి ప్రధానకారణంగా ఉంది. కాబట్టి, మీరు హెల్తీగా తింటూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించండి. ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం అవుతుంది. కాబట్టి, ఒత్తిడి తగ్గించుకొని, నేచురల్ గా ఈ క్రింది చిట్కాలను అనుసరించినట్లైతే ఫోర్ హెడ్ (నుదిటి భాగంలో)జుట్టురాలకుండా కాపాడుకోవచ్చు.

హాట్ ఆయిల్ మసాజ్: జుట్టు పెరుగుదలలో ఇది ఒక ఉత్తమ హోం రెమడీ. కొబ్బరినూనె, బాదంనూనె, మరియు లావెండర్ నూనె వంటివి ఉపయోగించడం వల్ల ఇవి రిలాక్స్ గా ఉంటుంది. హాట్ ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. మరియు జుట్టును బలోపేతం చేయడంతో పాటు, న్యూరిష్ గా ఉంచతుంది.

No comments:

Post a Comment