Wednesday, June 4, 2014

ఒత్తిడిలో మానసిక ఆరోగ్యం తగ్గిన జాగ్రతలు...

నేను ఎంత ఆనందంగా న్నాను? అనే ప్రశ్నతో మన ఆలోచనను ఆరంభిద్దాం. మొత్తం 100 శాతంలో నేను ఎంత శాతం ఆనందంగా ఉన్నాను?
ఒకవేళ ఆనందంగా లేకపోతే ఎందుకు ఆనందంగా లేను? నేను ఎందులో ఆనందం వెదుక్కుంటున్నాను? - ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే అనేకానేక అంశాలను చర్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో మనుష్యులు మానసిక ఆరోగ్యం దెబ్బ తిని బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఆధునిక సాంకేతిక పురోభివృద్ధి జరుగుతున్నా, అనేకానేక అవకాశాలు అందు బాటులోకి వస్తున్నా మనిషి మాత్రం ఆనందంగా ఉండలేకపోతున్నాడు. మానసిక సమస్యలకు గురవుతున్నాడు. వీటన్నిటికీ ప్రధాన కారణం యాంత్రికమయమైపోయిన జీవనవిధానం. ప్రజలకు తమకు ఏమి కావాలనే అంశంపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, అహం దెబ్బ తినడం, ఈర్ష్య, అసూయలు ఎక్కువ కావడం, లక్ష్యాలను సాధించలేకపోవడం, లైంగికపరమైన సమస్యలు, నిరాశానిస్పృహలకు గురి కావడం మొదలైన పలు అంశాలు మనిషి మానసికంగా కృంగిపోవడానికి, మానసిక సమస్యలకు గురి కావడానికి కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రధా నంగా మానసిక ప్రశాంతతను పొందాలి. మానసిక ప్రశాంతత ద్వారా పలు మానసిక సమస్యలను నివారించుకోవచ్చు. తద్వారా శారీరక రుగ్మతలను కూడా నివారించు కోవచ్చు. మానసిక ప్రశాంతత పొందడానికి కొన్ని చిన్న చిన్న సూచనలు పాటిస్తే సరిపోతుంది. వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం.


No comments:

Post a Comment