Monday, November 10, 2014

రుచికరమైన మసాలా పూరి: మాన్ సూన్ స్పెషల్

మసాలా పూరి ఈ వర్షాకాలంలో స్నాక్ గా లేదా మీల్ గా లేదా డిన్నర్ టైమ్ లో కూడా తీసుకోవచ్చు. వెరైటీగా తయారుచేసే ఈ మసాలా పూరిలు తయారుచేయడం చాలా సులభం. రెగ్యులర్ పూరిలు తిని బోరుకొడుతున్నప్పుడు ఇలాంటి కొత్త
వంటలను ప్రయత్నివచ్చు. రెగ్యులర్ పూరిల్లా కాకుండా, ఈ మసాలా పూరిల కొరకు పెరుగు మరియు కొన్ని మసాలా దినుసులను ఉపయోగిస్తారు. దాని వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది . పెరుగుజోడించడం వల్ల కొంచెం పుల్లదానికి మసాలాలు పట్టించడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా కమ్మగా ఉంటుంది . వర్షాకాలంలో వీటి స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
 గోధుమపిండి: 2cups కారం: 1tbsp గరం మసాలా పౌడర్: 1/2tbsp జీలకర్ర: 1/4tsp పెరుగు: 1cup పచ్చిమిర్చి: 1-2(సన్నగా తరిగిపెట్టుకోవాలి) ఉప్పు: రుచికి సరిపడా కరివేపాకు : రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె : డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తయారుచేయు విధానం: 
1. ముందుగా పెరుగును ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. 
2. తర్వాత అందులో కారం, గరం మాసాల, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి మరియు పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. 
3. తర్వాత ఈ మిశ్రమంలోనే గోధుమ పిండి కూడా వేసి, నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం బాగా కలగలుపుకోవాలి. 
4. ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకొన్న పిండిని 15-20నిముషాలు పక్కన పెట్టుకోవాలి. 
5. 20నిముషాల తర్వాత మొత్తం పిండినుండి కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తుకోవాలి. 
6. అంతలోపు, పాన్ లో నూనె సోసి వేడి చేయాలి. వేడయ్యాక పూరిల్లా వత్తుకొన్న పూరిలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే మసాలా పూరీలు రెడీ. వీటికి ఎటువంటి చట్నీ లేదా సబ్జీ అవసరం ఉండదు. వీటని అలాగే ప్లెయిన్ గా రైతా లేదా పెరుగుతో తినవచ్చు. కమ్మగా రుచికరంగా ఉంటాయి.

No comments:

Post a Comment