Friday, November 21, 2014

బ్యూటిఫుల్ అనార్కలీ డ్రెస్సులో క్యూట్ గా ప్రెగ్నెంట్ జెనీలియా

రీసెంట్ గా ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాద్య బచ్ఛన్ బర్త్ డే ఈవెంట్ కు క్యూట్ హీరోయిన్ జెనీలియా హాజరయ్యారు. ఈ పార్టీలో జెనీలియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా చెప్పాలంటే నిండు గర్భంతో ఉన్న జెనీలియా మీద అందరి కళ్ళు.
బర్గ్ డే ఈవెంట్ కు హాజరైన జెనీలియా సాఫ్ట్ షేడ్ అనార్కలీ డ్రెస్స్ లో కనిపించింది. ఆమెతో పాటు ఆమె భర్త రితేష్ దేష్ ముఖ్ కూడా ఆరాద్య బచ్ఛన్ బర్త్ డే ఈవెంట్ కు బ్యూటి ఫుల్ స్మైల్ తో హాజరయ్యారు. ఆరాధ్యా బచ్ఛన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వీరితో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. వారిలో ముఖ్యంగా శిల్ఫాశెట్టి, కిరన్ రావ్ ఈ ఇద్దరు స్టార్ బ్యూటీలు ఈవెంట్ కు హాజరయ్యి సందడి చేశారు. అందరిలోకి గర్భంతో ఉన్న బబ్లీ జెలీనియా మాత్రం చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ స్మైల్ తో కనిపించింది. బబ్లీ బ్యూటీ జెనీలియా వైట్ మరియు మేతీ షేడ్ కలర్ అనార్కలీ డ్రెస్సును ధరించింది. గర్భంతో ఉన్న జెనీయా, బేబీ బంప్(పొట్ట)కనబడనీయకుండా వైట్ దుప్పటాను కప్పుకొన్నది. ప్రేక్షకులు కళ్ళు ఆమె పొట్ట మీద పడకుండా సాధ్యమైనంత వరకూ జాగ్రత్త పడింది. నిండు గర్భంతో ఉన్న జెనీలియా ధరించిన వైట్ అండ్ మేతి కలర్ షేడ్ అనార్కలీ డ్రెస్ చాలా సింపుల్ గా చాలా చక్కగా ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ ఉమెన్ సౌకర్యవంతమైన దుస్తుల్లో ఫర్ఫెక్ట్ గా కనిపించింది.
             మేతికలర్ సల్వార్ కమీజ్ ఎబ్రాయిడరీ వర్క్ డిజైన్ చేయబడినది. ముఖ్యంగా పింక్ కలర్ ఫుల్ స్లీవ్ మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఆకర్షణీయంగా ఉన్నది . మొత్తంగా చాలా అందంగా తయారై ఆమె ఫ్యాన్స్ ను సంతోషపరిచింది. ఈ డ్రెస్సులో జెలీనియాను చూస్తుంటే, చూసిన వారెవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు . ఆమె చబ్బీ చీక్స్ కవర్ చేస్తూ మేకప్ కూడా చాలా అందంగా వేసుకొన్నది. ఇక ఆమె పెదాలకు రెడ్ షేడ్ లిప్ స్టిక్ డీప్ గా కోట్ చేసింది. బుగ్గల మీద మెరిసేటీ ఫౌండేషన్ మరింత ఆకర్షనీయంగా కనబడేలా చేసింది. అలాగే కొన్ని స్టైలిష్ ఆభరణాలతో ప్రెగ్నెన్సీ స్టైల్ ను పూరించిందని చెప్పవచ్చు. మేతికలర్ సల్వర్ కు సూట్ అయ్యే విధంగా రెడ్ స్టోన్ నెక్ లెస్ ధరించింది. ఇక్కడ మరో ఫోటోలో ప్రెగ్నెన్సీ స్టైల్లో కనబడుతున్న జెనీలియా రీసెంట్ గా జరిగి సోనాలీ బింద్రే వెడ్డింగ్ యానివర్సరీలో ఇలా స్టైలిష్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో ఆమె చాలా క్యాజువల్ గా కనిపించింది. బ్లూ జీన్స్ ఓవర్ సైజ్డ్ వైట్ టాప్ లో ఆమె చూడటానికి అద్భుతంగా కనిపించింది. ఈ రెండు ఫోటోలు కంపేర్ చేస్తే ఆరాధ్యా బర్త్ డే పార్టీ వేర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు మరి మీ అభిప్రాయమేంటి...?

No comments:

Post a Comment