Friday, June 12, 2015

ఎగ్ దోస-ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

నాన్ వెజిటేరియన్ బ్రేక్ ఫాస్టుల్లో ఎగ్ దోస స్పెషల్. ఎగ్ దోస ఫ్రైడ్ ఎగ్ కు కాంబినేషన్ మరియు దోసె కూడా. మీరు మామూలుగా తయారు చేసుకొనే దోసెతో బోర్ అనిపిస్తుంటే ఈ విధంగా ప్రయత్నించి ఒక కొత్త రుచిని టేస్ట్ చేయవచ్చు. దోసె, దానిమీద ఆమ్లెట్
చాలా అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. ఈ ఎగ్ దోసకు చట్నీ, సాంబార్ వంటివి అవసరం ఉండదు. ఈ ఎగ్ దోసెను ఏదైనా సాస్ తో తినవచ్చు. ఎందుకంటే ఎగ్ ఫ్రై అయ్యుంటుంది. మరియు పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి తరగు వేయడం వల్ల చట్నీ అవసరం ఉండదు. ఉల్లిపాయలు: 1 (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి) పచ్చిమిర్చి: 2-4 (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి) కొత్తిమిర తరుగు: 1/2 cup (చిన్నగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి) గుడ్లు: 4 (పగులగొట్టాలి) దోసెపిండి: 1 bowl(200 grams) నెయ్యి లేదా వెజిటేబుల్ ఆయిల్: 2tbsp పెప్పర్: 1tsp ఓరిగానో: 1/2tsp(అవసరమైతే వేసుకోచ్చు.) ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం: 
1. ముందుగా గుడ్డును పగులగొట్టి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా గిలకొట్టాలి. 
2. తర్వాత నాన్ స్టిక్ తావాను స్టౌ మీద పెట్టి, వేడవ్వగానే అందులో ఒక చెంచా నెయ్యి లేదా నూనె వేసి పాన్ మొత్తానికి సర్ధాలి. 
3. తర్వాత గ్యాస్ మంటను మీడియంగా పెట్టి, దోసె పిండిని తవా మీద దోసెలాగా పోయాలి. 
4. దోసె పోసిన ఒక నిమిషం తర్వాత మరో చెంచా నూనెను దోసె మీద చిలకరించాలి. 
5. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్లను పోసి దోసె మొత్తం సర్ధాలి. 6. 30నిముషాలు అలాగే ఉంచి తర్వత మరో సైడ్ తిప్పి మరో రెండు మినిముషాలు కాలనివ్వాలి. అంతే మంట తగ్గించి వేడి వేడి దోసె మీద పెప్పర్ పౌడర్ చిలకరించాలి. అంతే ఈ ఎగ్ దోసెను టమోటో లేదా చిల్లీ సాస్ తో సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment