Tuesday, July 21, 2015

చలికాలంలో చామంతుల వయ్యారం

అందంగా...ఆకర్షనీయంగా వివిధ రంగుల్లో మంచి వాసనతో నిండుగా పూలతో కనిపిస్తాయి చామంతి మొక్కలు. ఈ మొక్కలను పెంచుకోవడంలో కొంచెం శ్రద్ద పెడితే ఆ ప్రదేశానికే కొత్త కళ వస్తుుంది. చామంతి మొక్క ఆసియా
ఖండానికి చెందినిది. అయితే ఇది ప్రపంచ మొత్తం విస్తరించి విరబూస్తున్నాయి. క్రిసాంతమమ్ గా పిలిచే చామంతి క్రిసోన్(బంగారం), ఆంథోమాన్(పూలు) అనే రెండు గ్రీకు పదాల సమన్వయం. ఒకప్పుడు కేవలం పసుపు, తెలుపు రంగుల్లో మాత్రమే లభించే ఈ చామంతి పువ్వులు ఇప్పుడు రకరకాల రంగుల్లో, మరిన్ని ప్రత్యేకతలతోనూ ఇవి మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఒకటి కాండాన్ని కత్తిరించి పెంచినవవైతే, మరికొన్ని టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేిసన రకం. మొత్తానికి కొన్ని వేల రకాలు చామంతుల మనకు లభిస్తున్నాయి. చామంతులు పెంచే విధానం: చామంతి మొక్కల్ని కుండీల్లోనే కాదు, నేలమీద కూడా సులుభంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని నాటేందుకు మరీ పొడిబారిన లేదా మరి ఎక్కువ తేమ లేదా నీరున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోకూడదు. నేలలో 6 నుండి 6.5 పిహెచ్ స్థాయిలు ఉండేట్లు చూసుకోవాలి. ఎర్రమట్టి యాభైశాతం, ముఫ్పైశాతం డీకంపోస్ట్ చేసిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్, 20శాతం కుళ్లిపోయిన ఆకుల ఎరువుని కలిపి ఎరువుని తయారుచేసుకొని కుండీల్లో నింపుకోవాలి. చామంతి మొక్కల్ని నేలలో నాటేటప్పుడు ఒక్కో దానికి మద్య ఆరు అంగుళాల ఎండం ఉండేలా చూసుకోవాలి. పెద్ద కుండీల్లో అయితే రెండు మూడు కలిపి నాటుకోవచ్చు. అప్పుడు గుబురుగా అందంగా కనిపిస్తాయి. 3గంటల ఎండ తప్పనిసరి: చామంత మొక్కలకు కనీసం మూడు గంటల పాటు నేరుగా ఎండ తగిలే ఉండాలి. అలాగని 28డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే మాత్రం షేడ్ తప్పనిసరి. లేదంటే పాక్షికంగా ఎండ తగిలే చోటకు మార్చుకోవాలి. మొక్కకు గాలి, వెలుతురు ధారాళంగా తగిలే ప్రదేశంలో మొక్కను నాటుకోవాలి. విరివిగా పూలు పూయాలంటే తగినన్ని పోషకాలు ఎప్పటికప్పుడు అందించాలి. మొదట మొక్క పెరిగే క్రమంలో కొద్దిగా ద్రవరూపంలో ఉన్న ఎన్ పీకేను స్ప్రే చేయాలి. మొగ్గలు తొడిగే క్రమంలో ఇంకొద్దిగా ఎక్కువగా పొటాషియం ఎక్కువ ఉండేలా ఎన్ పీకె మిశ్రమాన్ని మొక్కకు అందించాలి. మొగ్గలు తొడిగినప్పుడే ఒక చంెచా చొప్పున బోన్ మీల్ నూ అందిస్తే పూలు బాగా పూస్తాయి. ఈ మొక్కకు చీడపీడల సమస్యా ఎక్కువే. నీళ్లు మరీ ఎక్కువ అయినప్పుడు కాండం, వేర్లూ కుళ్లిపోవడం వంటి సమస్యలే కాదు, తెల్లదోమ, పేనుబంక వంటివీ తప్పకపోవచ్చు. అందుకే ప్రతి పదిహేను రోజులకోసారి వేప నూనెను నీళ్లో కలుపుకొని చల్లుకోవాలి. ఈ మొక్కలు రకాన్ని బట్టి ఇరవై నుంచి మూడు వందల రూపాయల్లో లభిస్తున్నాయి....

No comments:

Post a Comment