Wednesday, September 23, 2015

మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మార్చేసే స్మూతీస్ ....


ఉరుకుల పరుగుల జీవితంలో వ్యక్తుల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పుల వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆహారం పట్ల సరైన జాగ్రత్తలు
తీసుకోకపోవడం వల్ల విటమిన్ల లోపంతో హార్మోనుల్లో లోపం దాంతో వివిధ రకాల సమస్యల భారి పడుతున్నారు. డైట్ విషయంలో ఒక్క ఆహారం మాత్రమే కాదు, స్మూతీస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్మూతీస్ శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలను అందిస్తుంది. వీటిని తయారుచేసి తీసుకోవడం చాలా సులభం. మరి స్మూతీస్ తయారుచేయడానికి ఏం చేయాలి? ఏమేమికావాలి? సింపుల్ గా ఒక బ్లెండర్, ఫ్రెష్ ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ మరియు బేస్. బేస్ కోసం పాలు మరియు పెరుగు మరియు నీళ్లు. ముఖ్యంగా స్మూతీస్ కోసం ముఖ్యంగా కావల్సినవి పండ్లు, వెజిటేబుల్స్, ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి.


No comments:

Post a Comment