Thursday, September 2, 2010

ఆటంకాలను అధిగమించేది అధ్యయనమే

Buzz up! మార్క్సిస్టు సౌజన్యంతో

ప్రజలలో పనిచేయటమే కమ్యూనిస్టులకు ముఖ్యమనీ, సిద్థాంతాలు చర్చిస్తే ఒరిగేదేమీ లేదనీ కొందరు విమర్శిస్తుంటారు. మన కార్యకర్తలకు సిద్థాంత అవగాహనలేకపోయినా, మంచివారుగా గుర్తింపు ఉంటే, ప్రజలలో కష్టపడిపనిచేసి వారి అభిమానం పొందగలిగితే చాలని వీళ్లు నిజంగా కూడా నమ్ముతుంటారు. ఈ ధోరణి చాలా నష్టదాయకం. తక్షణం ఒనగూడే కొన్ని తాత్కాలిక ప్రయోజనాలతోనే సంతృప్తిపడి, దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిపెట్టటానికి ఇది దారితీస్తుందని మనం గ్రహించటం అవసరం.

కమ్యూనిస్టు కార్యకర్తలు అధ్యయనం-ఆచ రణ ద్వారా నిరంతరం తమ రాజకీయ, సైద్థాం తిక స్థాయిని పెంచుకోవటానికి ప్రయత్నించటం అవసరం. అయితే అధ్యయనం, ఆచరణయొక్క గతితార్కిక సంబంధాన్ని అర్థంచేసుకోకుండా కొంతమంది అధ్యయనాన్ని, ఆచరణకు పోటీగా ముందుకు తెస్తుంటారు. ఆవిధంగా పదే, పదే మాట్లాడుతుంటారు. పుస్తకాలు చదవటాన్ని, సిద్థాంతాలు మాట్లాడటాన్ని, స్టడీసర్కిల్స్‌ను, రాజకీయ క్లాసులను నడపటాన్ని, పైకి కాకపో యినా పరోక్షంగా ఇలాంటివారు చులకన చేస్తుం టారు. ప్రజలలో పనిచేయటమే కమ్యూనిస్టులకు ముఖ్యమనీ, సిద్థాంతాలు చర్చిస్తే ఒరిగేదేమీ లేదనీ విమర్శిస్తుంటారు. మన కార్యకర్తలకు సిద్థా ంత అవగాహనలేకపోయినా, మంచివారుగా గుర్తింపు ఉంటే, ప్రజలలో కష్టపడిపనిచేసి వారి అభిమానం పొందగలిగితే చాలని వీళ్లు నిజం గా కూడా నమ్ముతుంటారు. ఈ ధోరణి చాలా నష్టదాయకం. తక్షణం ఒనగూడే కొన్ని తాత్కా లిక ప్రయోజనాలతోనే సంతృప్తిపడి, దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిపెట్టటానికి ఇది దారితీస్తుం దని మనం గ్రహించటం అవసరం.

అధ్యయనం, ఆచరణలంటే ఏమిటి? వాటి లో ఏది ముఖ్యమయింది? లేక ఏది ఎక్కువ, ఏది తక్కువ? ఒక్కమాటలో చెప్పాలంటే ఆచరణ అంటే మనం పనిచేయటం. అధ్యయనం అంటే ఇతరులు చేసిన పనిగురించి తెలుసుకో వటం. అంటే, ఆచరణ ముఖ్యమా లేక అధ్యయ నం ముఖ్యమా అని మనం చర్చిస్తున్నామంటే అర్థం, మనం పనిచేయటం ముఖ్యమా లేక ఇతరులు చేసినపనుల గురించి తెలుసుకోవటం ముఖ్యమా అని చర్చిస్తున్నామన్నమాట. ప్రతిదీ మనమే చేసి తెలుసుకోవటం సాధ్యంకాని విషయం. నిప్పు కాలుతుంది అనే నిజం ఈనాడు మనందరికీ తెలుసు. ఎలా తెలుసు? అసలు నిప్పు కాలుతుందనేది ముందు మానవుడికి ఎలా తెలిసింది? ఎవడో నిప్పులో చెయ్యి పెట్టిఉంటాడు. వాడికి కాలి ఉంటుంది. అందువల్ల నిప్పులో చెయ్యిపెడితే కాలుతుంది అని అర్థమ యింది. ఆ అర్థమయినవాడు మళ్లీ నిప్పులో కావాలని ఎపుడూ చేయిపెట్టడు. అంతవరకూ సరే అతనికి అనుభవంలో, ఆచరణలో 'నిప్పు కాలుతుంది' అని అర్థమయింది. మిగతా మానవులందరికీ 'నిప్పుకాలుతుంది' అని అర్థం కావాలంటే అందరూ నిప్పులో చేతులు పెట్టా ల్సిందేనా? అవసరంలేదు. ఒకసారి కాలినవాడు అందరికీ చెబితే సరిపోతుంది. అలా చెప్పా లంటే ఒక భావం, దానిని వ్యక్తంచేయటానికి భాష అవసరం. మానవుడు తనగురించి ఇతరు లకు చెప్పటానికి, ఇతరులనుండి తాను తెలుసు కోవటానికి మొదట ఏర్పడిందే భావం, భాష అనేది మనం అర్థం చేసుకోవాలి.

అందువల్ల పనిచేయటంలో ఒకేసారి రెండు లాభాలు జరుగుతుంటాయి. ఒకటి ఆ పని వల్ల కొంత ఉత్పత్తి జరిగి మన అవసరాలు తీరుతుంటాయి. రెండోది ఆ పనిలో అనుభవం వల్ల నైపుణ్యం పెరిగి, అంతకు ముందు తెలియని కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఏ పని ఎంత సులువుగా చేయవచ్చో లేక ఏ పని చేయకూడదో, చేస్తే ఎంతనష్టమో కూడా తెలు స్తుంటాయి. ఇలా ఒకవ్యక్తి పనిలో తెలిసే కొత్త విషయాలను మిగతావారు నేర్చుకోవటానికి మళ్లీ ప్రతివారూ ఆ పనిని చేయనక్కరలేదు. ఆ అనుభవాలను తెలుసుకుంటే సరిపోతుంది. ఈరోజున అనేకమంది శాస్త్రవేత్తలు కని పెట్టిన విషయాలను ప్రజలందరూ వాడుకుంటు న్నారు తప్ప ప్రతివాడూ ప్రతిదాన్నీ తిరిగి కని పెట్టాల్సిన అవసరం లేదు. రేడియో కనిపెట్టిన మార్కొనీ మాత్రమే రేడియో ఉపయోగించలేదు. అందరం ఉపయోగిస్తున్నాం. అలాగే మానవ సమాజంలో ఎవరు, ఏ పని చేయాలన్నా, ఆ పనిలో ఇంతకు ముందే పనిచేసినవారి అనుభ వాలను తెలుసుకోవటం, నేర్చుకోవటం చాలా ఉపయోగంగా ఉంటుంది. అపుడు తాను తన పనిలో తెలుసుకున్న కొత్తవిషయాలతోబాటు, మిగతావారి పనిలో వారు నేర్చుకున్న కొత్తవిష యాలను కూడా తాను నేర్చుకుంటాడు. ఆ పద్దతి అనుసరించనివాళ్లు విజ్ఞానంలో (నాణ్యమైన పనిలో) వెనకబడిపోతారు.

మరయితే ఇతరులపనిలోని అనుభవాలను తెలుసుకోవటం, నేర్చుకోవటం ఎలా చేయాలి? ఇతరులతో చర్చించటంద్వారానే అలాచేయటం సాధ్యమౌతుంది. అందువల్ల ఎపుడూ మనతో పాటు పనిచేస్తున్న ఇతరులతో చర్చిస్తూ ఉండాలి. ఆ విధంగా మాత్రమే వారి అనుభవాలు మనకు అర్థమవుతాయి. కొత్తవిషయాలు తెలు స్తాయి. అయితే ఇక్కడో చిక్కుసమస్య ఉంది. అదేమంటే, ఇపుడు మనతోపాటు జీవిస్తున్న వారితోనయితే చర్చించవచ్చు. ఇప్పటికే చనిపో యినవారి సంగతేమిటి? వారి అనుభవాలలో కూడా మనకు ఉపయోగకరమైనవి చాలా ఉండవచ్చుగదా? నిజానికి ఇపుడు మానవ సమాజంలో అందుబాటులో ఉన్న జ్ఞానంలో అత్యధికం మన ముందుతరాలవారు కనిపెట్టిన విషయాలే అనేది మనకు తెలుసు. అందువల్ల మన ముందు తరాల నుండి నేర్చుకోవటం ఒక ముఖ్యమైన పద్ధతి. అది లేకుండా మానవజాతి మనుగడే లేదు. అయితే చనిపోయినవారిలో రెండురకాల వారుంటారు. కొత్త విషయాలేమీ కనిపెట్టకుండా తమకాలంలో ఉనికిలోఉన్న విజ్ఞానాన్ని వాడు కుంటూ సాధారణంగా బతికేసిన వాళ్లే అత్యధికు లుంటారు. వారినుండి మనం అదనంగా నేర్చు కోవల్సిందేమీ ఉండదు. అలాకాకుండా ఆ కాలం విజ్ఞానానికి మించి తమ కార్యాచరణద్వారా కొత్త విషయాలను ఆవిష్కరించినవారు కొందరుం టారు. ఈ రకం గొప్ప వ్యక్తులు తమ అనుభవా లనూ, కనిపెట్టిన విషయాలనూ మనకు తెలియ జేయటానికి రాసినవే పుస్తకాలు, గ్రంథాల రూపంలో మన ముందున్నాయి. శాస్త్రగ్రంథాలు చదవటం అంటే మన పూర్వీకుల, ప్రత్యేకించి ఆయా రంగాలలో నిష్టాతుల ఆచరణకు సంబం ధించిన, వారి కాలంలో అనుభవాలకు సంబం ధించిన విషయాలను తెలుసుకోవటమేనని అర్థం చేసుకోవాలి. ఆ పద్ధతివల్ల మన పనిలో నైపు ణ్యం పెరుగుతుంది.

రాజకీయ, సిద్థాంత అధ్యయనం పార్టీ పనిలో నైపుణ్యం సాధించటానికే కాక కార్య కర్తలు పొరపాటు భావాలకూ, పెడదోరణులకూ గురికాకుండా కూడా ఉపయోగపడుతుంది. కార్యకర్తలలో వచ్చే వివిధ పెడదోరణులకు మూలం ఎక్కడుంది? మన చుట్టూ ఉన్న బూర్జు వా, భూస్వామ్య సమాజంలో ఉంది. ఈ సమా జంలో ఉండే కుళ్లు, స్వార్థపూరిత వాతావరణం నిరంతరం మనపై దాడిచేస్తుంటాయి. బూర్జువా భావజాలాన్ని మన మెదడులో ప్రవేశపెడు తుంటాయి. రోగక్రిములు కుట్టిన ప్రతివాడికీ రోగం రాదు. కొద్దిమందికే వస్తుంది. ఎందుకని? రోగక్రిముల దాడిని తట్టుకునే రోగనిరోధకశక్తి శరీరంలో తగ్గినవాడికే రోగం వస్తుంది. అలాగే బూర్జువా భావజాలం దాడిని తట్టుకునే శక్తి ఏ కార్యకర్తకైతే తక్కువగా ఉంటుందో అతనిలో పెడదోరణులు ప్రవేశిస్తాయి. అందువల్ల మన కార్యకర్తలకు పొరపాటు భావాలూ, పెడదోర ణులూ రాకుండా చేయాలంటే మనం ఏం చేయాలి? బూర్జువా సిద్థాంతాల దాడిని తట్టు కునే శక్తిని పెంచాలి. సాదారణంగా మనం ఏం చేస్తుంటాం? ఆ తప్పు దోరణులు పార్టీకి ఎలా నష్టమో చెప్తుంటాం. వాటికి గురికాకూ డదని బోధిస్తుంటాం. ఒకవేళ గురైతే చర్యలు తీసుకుంటుంటాం. ఇక్కడో విషయం మనం గమనించాలి. కావాలని ఏ కార్యకర్తా తప్పుడు భావాలకు గురికాడు. జబ్బుల్ని జయించాలంటే వచ్చిం తర్వాత మందులు వేయడంకంటే రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా పెంచాలని ఎలాఅయితే చెబుతుంటామో, అలాగే పార్టీలో పొరపాటు భావాలు ప్రవేశించకుండా ఉండాలంటే పార్టీలో ఆరోగ్యకరమైన భావాలు పెంచాలి. బూర్జువా భావజాలాన్ని ఎదుర్కో వాలంటే దానిని కార్మిక వర్గ భావజాలంతోనే ఎదుర్కోగలం. అలాగే బూర్జువా సిద్థాంతాలను కార్మికవర్గ సిద్థాంతాలతోనే ఎదుర్కోవాలి. అందువల్ల కార్మికవర్గ భావజాలం, సిద్థాంతం మాత్రమే కమ్యూనిస్టులకు 'సర్వరోగనివారిణి'గా పని చేస్తాయి. పార్టీలో వచ్చే పొరపాటు భావాలు, పెడదోరణులను అధిగమించటానికీ, అవి రాకుండా నిరోధించటానికీ నిరంతరం రాజకీయ, సిద్థాంత అధ్యయనంపై కేంద్రీకరించ టం ఉపయోగపడుతుంది.

పరిణామక్రమంలో ప్రతిదీ ఆటుపోట్లకు గురవుతుంది. అలాగే కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా ఆటుపోట్లుంటాయి. ఆటంకాలు ఎదురవుతాయి. వీటిని సక్రమంగా అర్థంచేసు కుని అధిగమించేశక్తిని రాజకీయ, సిద్థాంత అధ్యయనం మనకు ఇస్తుంది. ఈరోజు కమ్యూ నిస్టు ఉద్యమం తీవ్ర సవాళ్లను ఎదుర్కొం టోంది. 70 సంవత్సరాల సోషలిజం సోవి యట్‌లో కూలిపోయింది. ఇపుడు చైనాలో ఉన్నది సోషలిజమా, కాదా అనే చర్చ నడుస్తోంది. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అనే సందే హాలు సర్వత్రా వ్యాపింపజేయబడుతు న్నాయి. ఈ వాతావరణం సహజంగానే కార్యకర్తలకు, కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులకు ఆందోళన కలిగిస్తుంది. కానీ అలాంటి ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదు. నీరు పల్లానికి ప్రవహి స్తుంది. అది దాని లక్షణం. అలా ప్రవహించే దారిలో ఏదైనా ఆటంకం ఎదురైతే మరోదారి వెతుక్కుంటుంది తప్ప పల్లానికి ప్రవహించటం ఆగిపోదు. అలాగే పెట్టుబడికీ, శ్రమకూ మధ్య జరిగే ఘర్షణలో దోపిడీ ఉన్నంతకాలం దాని నుండి విముక్తిపొందే ప్రయత్నమూ ఉంటుంది. ఒక పద్థతి విఫలమైతే కార్మికోద్యమం మరోపద్థతి ఎంచుకుంటుంది. మరో విశేషమేమంటే ఒకసారి విఫలమైన పద్ధతిలోంచే కొత్తపద్ధతిని నేర్చుకుం టుంది. గత చరిత్రంతా ఇలాగే జరిగింది.

1848 వరకూ కార్మికోద్యమానికి శాస్త్రీయ సిద్ధాంతమే లేదు. మనుషుల కార్యాచరణతో సంబంధం లేకుండా ఊహల్లోనే సోషలిజం ఉండేది. కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ల రంగప్రవేశంతో ఆ లోటు తీరింది. వర్గపోరాట సిద్థాంతాన్ని కార్మికవర్గానికి వారు అందించారు. అయితే ఆ సిద్థాంతాల వ్యాప్తికి నిర్మాణ యంత్రాంగం లేక ఆటంకాలేర్పడ్డాయి. 1864 లో మొదటి ఇంటర్నేషనల్‌ స్థాపించటం ద్వారా ఆ ఆటంకాన్ని అధిగమించగలిగారు. ఉద్యమం ఉధృతమైంది. 1870నాటికి పారిస్‌ నగరంలో కార్మికవర్గం అధికారంలోకే వచ్చేసింది. అయితే 90రోజులలోనే అది అతిదారుణంగా అణచి వేయబడింది. 30 వేల మంది కార్మికులను ఊచకోత కోసారు. అక్కడేకాదు, యూరప్‌ అంతా కార్మికనాయకులను చంపేశారు. నిర్బంధం తట్టుకోలేక 'ఇంటర్నేషనల్‌' సంస్థను కూడా 1876లో రద్దు చేసుకోవాల్సివచ్చింది. దీంతో కమ్యూనిస్టులపని అయిపోయిందనే అంతా అను కున్నారు. కానీ ఆ వైఫల్యాలనుండి నాయకులు (మార్క్స్‌, ఎంగెల్స్‌లు) పాఠాలు తీసారు. ఉద్యమాన్ని కూడదీసారు. 1889లో ఎంగెల్స్‌ ఆధ్యర్యంలో తిరిగి రెండవ ఇంటర్నేషనల్‌ సంస్థ స్థాపించబడింది. అప్పటికే మార్క్స్‌ చనిపోయాడు. ఈసారి కార్మికసంఘాలే సరిపోవని, కార్మికులకు రాజకీయపార్టీ అవసరమని నిర్దారణకు వచ్చారు.

వివిధ దేశాలలో 'సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ'లు ఏర్పడ్డాయి. మళ్లీ ఉద్యమాలు ఉధృతమ య్యాయి. 1905 నాటికే రష్యాలో జార్‌వ్యతిరేక విప్లవం పెల్లుబికింది. కానీ ఈ విప్లవం కూడా ఓడిపోయింది. మళ్లీ కొన్ని వేలమంది విప్లవ కారులను చంపేసారు. దారుణ నిర్భందాన్ని అమలు జరిపారు. అయినా ఉద్యమం చచ్చిపో లేదు. ఈ ఓటమి నుండి లెనిన్‌ పాఠాలు తీసారు. పార్టీ ఉండగానే సరిపోదు, అది విప్లవ పార్టీగా ఉక్కుశిక్షణతో ఉండాలన్నాడు. పార్టీలో దీనికోసం ఆయన పెద్దపోరాటమే చేయాల్సి వచ్చింది. ఈనాటి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రం, పూర్తికాలం కార్యకర్తల భావన వగైరా ముఖ్య నిర్మాణ సూత్రాలన్నీ ఆనాటి ఆ పోరా టం నుండే ఉద్భవించాయి. అలాగే పార్టీకి ఎత్తుగడలు కూడా ఉండాలనే పాఠం తీయ బడింది. ఒకడుగు ముందుకు రెండడుగులు వెన క్కు గ్రంథం ఆ సమయంలోనే లెనిన్‌ వ్రాసాడు.

ఈ అనుభవాలన్నింటితో మళ్లీ విప్లవపార్టీ నిర్మించబడింది. 1912 లో మొదటి ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. ఈ యుద్దంలో కమ్యూనిస్టులు ఎలాంటి వైఖరిని తీసుకుంటే కార్మికోద్యమం ముందుకెళుతుంది అనే సమస్య ప్రముఖంగా ముందుకొచ్చింది. ఇది కొత్త అనుభవం. అంతకు ముందంతా ఎలాగైతే ఆటంకం వచ్చినపుడల్లా కొంతనష్టం సంభవించి దానినుండి నేర్చుకొని ముందుకుపోవటం జరిగిందో ఇపుడూ అలాగే జరిగింది. యుద్ధం లో ఎక్కడికక్కడ తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం తిరగబడాలని, విప్లవాలు సాధిం చాలని లెనిన్‌ పిలుపిచ్చాడు. కానీ ఆనాడు బలంగా ఉన్న జర్మన్‌ కమ్యూనిస్టులు కాట్‌స్కీ, రోజాలగ్సెంబర్గుల నాయకత్వంలో దీనిని వ్యతిరేకించారు. తమ, తమ జాతీయ ప్రభుత్వా లకు యుద్ధంలో సహకరించే వైఖరిని తీసుకో వాలని నిర్ణయించారు. ఈ చీలికతో రెండవ ఇంటర్నేషనల్‌ రద్దుకావాల్సి వచ్చింది. అయినా బోల్షివిక్‌పార్టీ ఆధ్యర్యంలో లెనిన్‌ తన పంథాను రష్యాలో విజయవంతంగా అమలు జరిపి 1917లో సోషలిస్టు విప్లవాన్ని సాధించాడు. అప్పటికే బలమైన కార్మికోద్యమాలు కలిగి ఉన్నా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ లాంటి దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఆ చక్కటి అవకాశాన్ని కోల్పోయాయి. ఆ దేశాల్లో అనుసరించిన తప్పుడు పంథా వల్ల ఉద్యమాలు చాలా బలహీన పడ్డాయి. ఈ వైఫల్యాల నుండి, సోవియట్‌ విజయాలనుండి సరైన పాఠాలు నేర్చుకోవటం వల్లనే రెండవ ప్రపంచయుద్ధంలో అనేక యూరప్‌దేశాలు సోషలిస్టు విప్లవాలు సాధించి మొత్తం ప్రపంచంలోనే ఒక బలమైన 'సోషలిస్టు శిభిరం' ఏర్పడటం సాధ్యమైంది.

ఇపుడు మళ్లీ కొత్త ఆటంకం ప్రారంభ మైంది. సోషలిజం ఎలా నిర్మించాలి అనే విషయంలో ఏర్పడ్డ అయోమయమే ప్రస్తుత కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రధాన అవరోధంగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావటం, సోషలిజం దిశగా ఆర్థికవ్యవస్థను నిర్మించటం రెండూ వేరు వేరు సమస్యలు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావటంతోనే ఆ దేశంలో సోషలిజం వచ్చినట్లుకాదు. ఇప్పటి వరకూ పెట్టుబడిదారీ దేశం అని పిలవబడు తున్న భారత దేశంలో ఏదో ఒక తేదీన కమ్యూ నిస్టులు అధికారంలోకి వస్తే, ఆ మరుసటిరోజు నుండి మనదేశం సోషలిస్టుదేశం అని పిలవ బడుతుందా? లేదు. సోషలిజం నిర్మాణం అంత తేలికా కాదు, అంత వేగం గానూ జరగదు. సోషలిజం అంటే స్వంత ఆస్థి రద్దుకావటం. అది ఒకేసారి జరగదు. ప్రత్యేకించి పెట్టుబడి దారీ పద్ధతుల్లోనే ఇంకా ఉత్పత్తిని పెంచగలిగే అవకాశాలున్నపుడు సోషలిస్టు ఆర్థికవ్యవస్థ ఏర్పడటానికి ఇంకా సుదీర్ఘకాలం పట్టే పరిస్థితు లుంటాయి. ఈ కాలంలో ఉత్పత్తిపద్ధతులు, ఆర్థిక నిర్వహణ, ఆస్తిరూపాలు ఎలా ఉండాలనే విషయమై లెనిన్‌కాలం నుండి ఇప్పటివరకూ అనేక ప్రతి పాదనలు, ప్రయోగాలు జరిగాయి. ఒక దేశంలో సోషలిజం సాధ్యమా అనే దగ్గర నుండి మార్కెట్‌ను ఉపయోగించుకోవాలా లేదా అనేదాకా అనేక వాదనలు, సిద్థాంతాలు ముం దుకు వచ్చాయి. ఈ సిద్థాంతాలు, వాటి ప్రయో గాల తప్పొప్పులన్నింటినీ ఆచరణ ద్వారానే మదింపువేయాలి. వివిధ దేశాలలో కమ్యూ నిస్టులు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. కమ్యూ నిస్టు పార్టీ (మార్క్సిస్టు)కు సంబంధించినంత వరకూ ఇందుకు సంబంధించి 'కొన్ని సిద్థాంత సమస్యలపై' ఇంకా నిర్థారణకు రావల్సిఉంది.

గతంలో కమ్యూనిస్టు సిద్థాంతం ఉనికిలోకి రావటంలో, కార్మిక సంఘాలు ఏర్పాటు చేయటంలో, పార్టీ ఏర్పాటులో, పార్టీ ఎలా ఉండాలనేదానిలో, శత్రువుతో ఎత్తుగడల విషయంలో, విప్లవం సాధించటం, అధికారం లోకి రావటంలో అనేక సమస్యలు, ఆటంకాలు, అణచివేతలు సంభవించాయి. ఈ సుదీర్ఘచరిత్ర లోని ముఖ్యమైన మూలమలుపులన్నింటిలో కమ్యూనిస్టు ఉద్యమం అనేక కష్టనష్టాలకోర్చింది. అసమాన త్యాగాలు చేసింది. వేల, లక్షల మంది కార్మిక, కమ్యూనిస్టు యోధుల రక్త బలితర్పణం గావించింది. అయినా ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి ముందుకే, మునుముందుకే సాగింది.

ఇక్కడో విషయం చెప్పాలి. చరిత్రంతా చూస్తే కమ్యూనిస్టు ఉద్యమం అనేక సార్లు క్రింద పడుతోంది, మళ్లీ లేస్తోంది, పడిన ప్రతిసారీ లేస్తోంది అనేది అర్థమౌతోంది. అయితే లేచిన ప్రతిసారీ మళ్లీ పడుతోందిగదా మళ్లీ పడటానికే అయినపుడు ఇంక లేవటం ఎందుకు అనే సందేహం కొందరికైనా వచ్చే అవకాశం ఉంది. కానీ చరిత్ర పరిశీలిస్తే మనకోవిషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమంటే ఉద్యమం తిరిగి పుంజుకున్న ప్రతిసారీ, దెబ్బతిన్నప్పటి పాతరూ పంలోనే, యథాస్థాయిలోనే పుంజుకోవటంగాక, మరింత ఉన్నతరూపంలోనూ, పెద్దసైజులోనూ పుంజుకుంటోంది. పడిపోయి తిరిగి లేచిన ప్రతిసారీ ఈ విషయం రుజువయింది. అందువల్ల సామ్రాజ్యవాదులను, పెట్టుబడి దారీ దోపిడీని 7 దశాబ్దాలపాటు గడ, గడలా డించిన 'సోషలిస్టు శిభిరం' నేడు తాత్కాలికంగా దెబ్బతిన్నా, మరింత ఉన్నతరూపంలో, విస్తృత పరిమాణంలో పెట్టుబడిదారీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే స్థితిలో తిరిగి ఆవిర్భవించనుండటం తిరుగులేని సత్యం.ఈ విధంగా గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలనూ, ఆటంకాలనూ ఆచరణ, అనుభ వాల ద్వారా పరిష్కరించుకుని కమ్యూనిస్టు ఉద్యమం ముందుకుపోయిన తీరును శాస్త్రీయంగా అవగాహన చేసుకున్నపుడే ప్రస్తుత ఆటంకాలను కూడా తేలిగ్గా అధిగమించగలమనే సత్యం మనకు భోదపడుతుంది. సెంటిమెంట్లు, విశ్వా సాలతో కాకుండా సామాజిక శాస్త్రాల అధ్య యనం ద్వారానే ఉద్యమానికి ఎదురౌతున్న ఈ ఒడిదుడుకులను సహజమూ, తాత్కాలికమూ అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాము.

No comments:

Post a Comment