Wednesday, December 8, 2010

వరద బాధితుల గోడు

తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజుల నుండి చల్లని గాలులకు, చినుకులకు వరద బాధితుల గోడు వర్ణనాతీతం. గుడారాల్లో కాపురాలు చేసుకుంటూ పొయ్యి మండక పస్తులతో అల్లాడుతున్నారు. వరద ముంపు గురైనా ఏడాదైనా.. ఎలాంటీ సహాయక చర్యలు చేపట్టలేదు. గత నెలలో కలెక్టర్‌ మద్దూరు గ్రామాన్ని సందర్శించారు. నెలలోపు ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారు. ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బాధితులు ప్రకృతి వైపరిత్యాలతో అల్లాడిపోతున్నారు. కురువృద్ధులు గుడిసెల్లో నుంచి బయటకు రాలేక జీవచ్ఛావాలుగా కాలం గడుపుతున్నారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే బాధితుల గుడారాలు తడిసి నిల్వడానికి అవకాశం లేకుండా ఉంది. పేద వర్గాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక స్థోమత లేక స్థలాలు లేనందున తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితం గడుపుతున్నారు. చంటిపిల్లలు సైతం అనార్యోగాల పాలవుతూ పల్లెల్లో సరైన వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకునే పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి.

అకాల వర్షంతో చేతికొచ్చిన పంటలు పాడైపోతే మా బతుకులు అతుకుల బొందతా ఉటుందని రైతులు ఆవేదన వ్యక్త ంచేస్తున్నారు. ఆహార ధాన్యాలు తడిసిపోయి తినడానికి తిండిదొరకడం కష్టంగా మారుతోంది. పశువులు సైతం చలిగాలులకు వణుకుతూ అవస్థలు పడుతుంటే అధికారులకు కించిత జాలీ లేదని విమర్శలు ఉన్నాయి. తుంగభద్ర నది వరద ప్రభావంతో సర్వం కోల్పోయిన మద్దూర్‌ వరద బాధితులకు ప్రభుత్వం న్యాయం లేదు. ఆరుబయటే కాలం గడుపుతుంటే.. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏసి రూమ్‌లలో కూర్చున్న వారికి తమ సమస్యలు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వరద బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తుఫాన్‌ ప్రభావంతో ప్రాణహాని, నష్టాన్ని ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మండల అధికారులు గట్టిచర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని బాధితులు తెలుపుతున్నారు.

కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటా ఎమ్మెల్యే అబ్రహం
వరద బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌ పురుషోత్తంరెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. బాధితులకు న్యాయం చేస్తానను. మద్దూరు గ్రామంలోని ఇరువర్గాల ప్రభావంతో సమస్య కొలిక్కి రావడం లేదు. వర్షాల ప్రభావంతో బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తక్షణ చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
చర్యలు చేపడుతాం తహసీల్దార్‌, రామలింగయ్య
మద్దూరు వరద బాధితులకు స్థల సేకరణ కొనసాగుతుందని త్వరలో స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపడతాం. తుఫాన్‌ ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను సంబంధిత ఆర్‌ఐలు, విఆర్‌ఓలతో పర్యవేక్షణ కొనసాగించి వారిని అన్ని విధాలా ఆదుకుంటాం.

No comments:

Post a Comment