Sunday, December 26, 2010

గ్రీంటింగ్‌ పాయె ... ఎస్‌ఎంఎస్ వాచ్చే..!

కొత్త సంవత్సరం వస్తుందంట ేచాలు.. ఒకటే హడావుడి. పిల్లలు, పెద్దలు ముఖ్యంగా యువత రెండు వారాల ముందు నుంచే గ్రీంటింగ్‌ కార్డులు కొనుగోలు చేసేవారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు, పోస్టు, కొరియర్ల ద్వారా పంపిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్సహం చూపేవారు. పిల్లలు కూడా తమ అభిమాన సినిమా హీరోలు, దేవతల బొమ్మలు కొనుగోలు చేసి తోటి స్నేహితులకు అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. దీనివల్ల గ్రీటింగ్‌ కార్డులకు ఎంతో మోజు ఉండేది.

కొత్త సంవత్సరానికి నెల రోజుల ముందేనుంచే వ్యాపారులు ఆకర్షింపజేసే డిజైన్లతో కూడిన గ్రీటింగ్‌ కార్డులు అందుబాటులో ఉంచేవారు. అంబర్‌పేట, బాగ్‌ అంబర్‌పేట, గోల్నాక, విద్యానగర్‌ తదితర ప్రాంతల్లో ప్రత్యేకంగా గ్రీటింగ్‌ కార్డుల దుకాణాలు ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. కంప్యూటర్‌ కాలం కావడంతో పాత పద్ధతిలన్నీ పక్కన పడిపోతున్నాయి. సెల్‌ఫోన్‌ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ సెల్‌ను వినియోగిస్తున్నారు.
సెలఫోన్‌ (సిమ్‌) కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది అందువల్ల కొన్ని కంపెనీలు ఉచిత ఎస్‌ఎంఎస్‌ ఆఫర్‌లు ప్రకటిస్తుస్తూ వినియోగాదారులను ఆకట్టుకొంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే ఎస్‌ఎంఎస్‌ పంపడం అలవాటుగా మార్చుకొన్నారు. దీనివల్ల గ్రీటింగ్‌ కార్డులకు ఆధరణ తగ్గింది. అంబర్‌పేట నియోజకవర్గంలో న్యూ ఇయర్‌ సీజన్‌లో సుమారు వేయ్యిపైగా వ్యాపారులు గ్రీటింగ్‌ కార్డులు అమ్ముతూ ఉపాధి పొందేవారు. కానీ నేడు పదుల సంఖ్యలో కూడా దుకాణాలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్రీటింగ్‌ కార్డులు పంపితే ఇంకా పాతకాలపు పద్ధతులు అంటూ స్నేహితులే హేళన చేయడం విశేషం. దీన్ని బట్టే గ్రీటింగ్‌ కార్డులు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment