తెలుగులో కెరీర్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న పూనమ్ కౌర్‌కి మహేశ్‌బాబుతో సినిమా చెయ్యాలనేది కోరిక. హైదరాబాద్‌లో స్థిరపడిన పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అందగత్తెకి దైవచింతన బాగా ఎక్కువ. "మా ఇంట్లో పాతిక దాకా వినాయకుడి విగ్రహాలున్నాయి.
అలాగే గురుద్వారాతో పాటు సాయిబాబా గుడి, ఇతర దేవాలయాలకు వెళ్తుంటా. మెడిటేషన్, యోగా చేస్తాను'' అని ఆమె చెప్పింది. గ్లామర్ వరల్డ్‌లో ఉండేవాళ్లలో పార్టీ కల్చర్ కూడా ఎక్కువే. పూనమ్ అందుకు మినహాయింపు కాదు. "దీపావళి సమయంలో మా బ్రదర్, మా ఫ్రెండ్స్ సర్‌ప్రైజ్ పార్టీ ఇస్తుంటారు. పబ్‌లకి వెళ్లడం వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. కానీ మోడల్‌ని కదా. దానికి సంబంధించి వెళ్లాల్సి వస్తున్నది. అలాగే సినిమా యూనిట్ సభ్యులు, ఫ్రెండ్స్ జరుపుకునే బర్త్‌డే పార్టీలకి వెళ్తుంటా'' అని చెపుతుంది ఈ క్యూట్ గర్ల్.
No comments:
Post a Comment