
రమేష్‌ప్రసాద్ మాట్లాడుతూ, ఈనాటి ట్రెండ్ చాలా ఉత్సాహంతో సినిమారంగంలోకి వస్తున్నారు. సాప్ట్‌వేర్‌రంగంలో వచ్చి సక్సెస్ అయినవారు చాలమంది ఉన్నారు. అప్పట్లో ఆనంద్‌తో శేఖర్‌కమ్ముల కొత్త ఫార్మెట్‌తో వచ్చారు. ఈ చిత్ర పాటలువింటుంటే దర్శకుడు మంచి భవిష్యత్ ఉందనిపిస్తుంది అన్నారు. రామానాయుడు మాట్లాడుతూ... విదేశాల్లో తీసినా తెలుగు టైటిల్ చక్కగా పెట్టారు. కథ బాగుంటేనే అందరూ చూస్తారు. మంచి కథను ఎన్నుకునే విదేశాల్లో సినిమా తీసి ఉంటారనిపిస్తుంది అన్నారు.
హీరో నవకేష్ మాట్లాడుతూ, నాపేరు రేడియోజాకీగా నారాయణగా తెలుసు. ఈ సినిమాకు నవకేష్‌గా మార్చుకున్నాను. చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాను చేశాం. బామ్మ పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు.
చక్రి మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన ఇద్దరు మ్యూజిక్‌డైరెక్టర్లు కృష్ణమూర్తి, విద్యాధరణి నా దగ్గరకు వచ్చి ఆహ్వానించారు. వారి పాటలు బాగున్నాయి. జంట దర్శకులుగా పేరు తెచ్చుకుంటారని అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామన్నారు.
No comments:
Post a Comment