Saturday, July 9, 2011

బాలీవుడ్‌లో ఎస్ బ్యాచ్ వర్సెస్ కె బ్యాచ్

బాలీవుడ్‌లో మొన్నటివరకూ మూడు గ్రూప్‌లుండేవని టాక్‌. ఇప్పుడు మాత్రం దాదాపు పదిగ్రూప్‌లు అవతరించాయంటున్నారు........................................ అయితే వీటిలో ముఖ్యంగా అమితాబ్‌, సల్మాన్‌, షారుఖ్‌ గ్రూప్‌లు ముఖ్య మైనవి. ఈ మధ్యకాలంలో సల్మాన్‌ గ్రూప్‌ యమస్వింగ్‌లో ఉంది. 'దబాంగ్‌', 'రెడీ' సూపర్‌హిట్‌ కావటమే ఇందుకు కారణం.

ఈ గ్రూప్‌‌లోని హీరోయిన్‌లు సోనాక్షి సిన్హా, జలైన్‌ఖాన్‌, అసిన్‌. మొన్నటి వరకు కత్రినా ఉండేది. కానీ సల్మాన్‌ ఆమెను బ్యాన్‌ చేయటంతో అక్షయ్‌ కుమార్‌ గ్రూప్‌లో చేరింది. ఒకగూటి పక్షులుగా సల్మాన్‌ హీరోయిన్‌‌లందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ సల్మాన్‌తో టైమింగ్‌ను పంచుకునే విషయంలో ఎక్కడా గొడవలు పడకుండా మ్యానేజ్‌ చేసుకుంటున్నారు. తనను ఇష్టపడేవారంటే ప్రాణం ఇచ్చే సల్మాన్‌ ఈ ముగ్గురు హీరోయిన్ల విషయంలో కూడా ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాడు. వారుకూడా అంతేననుకోండి. ఆల్రెడీ అసిన్‌తో రెండు సినిమాలు చేశాడు సల్లు.

సోనాక్షికి 'దబాంగ్‌' అనంతరం 'కిక్‌' రీమేక్‌లో హీరోయిన్‌ అవకాశం ఇచ్చాడు. అలాగే 'వీర్‌' హీరోయిన్‌ జరైన్‌కు కూడా మరో ఛాన్స్‌ ఇస్తానని మాటిచ్చాడు. మరోపక్క అసిన్‌ త్వరలో గ్రూప్‌ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. షారుఖ్‌ నటించిన 'టూస్టేట్స్‌', అక్షయ్‌కుమార్‌తో 'హౌస్‌ఫుల్‌-2' చేస్తుండటంతో, ఎవరిగ్రూప్‌లో చేరాలనే విషయంలో కొంత గందరగోళం పడుతోంది. సల్మాన్‌‌కు అసిన్‌ను వదులుకోవటం ఇష్టంలేకపోయినా, అసిన్‌ కెరీర్‌ దృష్ట్యా ఈవిషయాన్ని లైట్‌ తీసు కున్నాడు.

No comments:

Post a Comment